యాప్‌కీ కహానీ...

26 Feb, 2018 01:53 IST|Sakshi

డైలీ ఎక్స్‌పెన్సెస్‌–2

మీకు వచ్చే జీతంలో మీరు ప్రతి నెల ఎంత మొత్తం ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవాలని భావిస్తున్నారా? అలాగే మీ ఖర్చులను వేటి కోసం అధికంగా చేస్తున్నారో ట్రాక్‌ చేయాలనుకుంటున్నారా? ఎలాంటి తికమక, గందరగోళం లేకుండా సులభంగా మీ ఆర్థిక లావాదేవీలపై పట్టు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారా? అయితే ఇంకేం.. ఆర్థిక లావాదేవీల నిర్వహణ కోసం ‘డైలీ ఎక్స్‌పెన్సెస్‌–2’ అనే యాప్‌ను ఉపయోగించి చూడండి. యూజర్లు దీన్ని గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ప్రత్యేకతలు
ఎయూజర్‌ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌.
♦  ఎఆదాయం, ఖర్చులకు సంబంధించిన లావాదేవీలను
కేటగరైజ్‌ చేసుకోవచ్చు.  
ముందుగా క్రియేట్‌ చేసుకున్న రికార్డులను తొలగించవచ్చు.  
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా బకాయిల చెల్లింపుల కోసం బిల్స్‌ రిమైండర్లను, అలర్ట్స్‌ను సెట్‌ చేసుకోవచ్చు.  
♦  ఆదాయ, వ్యయాలను రోజూ, వారం, నెల, ఏడాది వారీగా  చూసుకోవచ్చు.  
♦  డేటా బ్యాకప్‌ ఫీచర్‌ ఉంది. యాప్‌కు పాస్‌వర్డ్‌ను పెట్టుకోవచ్చు.  
రిపోర్టులను ఇన్ఫోగ్రాఫిక్స్‌ రూపంలో చూడొచ్చు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా