అక్కడ పట్టుకోసం యాపిల్ ఆరాటం

16 May, 2016 15:25 IST|Sakshi
అక్కడ పట్టుకోసం యాపిల్ ఆరాటం

బీజింగ్ : చైనాలోఎదుర్కొంటున్న ఎదురుదెబ్బలపై యాపిల్ గట్టి పోరాటం సాగిస్తోంది. ఎలాగైనా తమ మార్కెట్ ను పునర్ నిర్మించుకోవాలని యాపిల్ ఇంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ ప్రయత్నిస్తున్నారు. ఆ దేశంలో రెండో అతిపెద్ద రవాణా సర్వీసులను అందిస్తున్న దిది చుక్సింగ్ తో వంద కోట్ల డాలర్లు (ఒక బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టేందుకు డీల్ కుదుర్చుకున్న వెంటనే టిమ్ కుక్ బీజింగ్ పర్యటనకు వెళ్లారు. అమెరికా తర్వాత చైనానే ఈ కంపెనీకి రెండో అతిపెద్ద మార్కెట్ గా ఉంది. అయితే ఇటీవలి కాలంలో చైనాలో యాపిల్ కు గట్టి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఐఫోన్ ట్రేడ్ మార్కు కేసులో యాపిల్ ఇంక్ ఓడిపోవడంతో పాటు, స్మార్ట్ ఫోన్ అమ్మకాలు పడిపోయాయి.

 

దీంతో చైనాలో ఎలాగైనా తమ అమ్మకాలను  పెంచుకోవాలని యాపిల్ ప్రయత్నిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా చైనా ప్రభుత్వ పెద్దలతో కుక్ సమావేశం కానున్నారు. బీజింగ్ లోని యాపిల్ లో స్టోర్ లో దిది చుక్సింగ్ ప్రెసిడెంట్ జీన్ లియుతో కుక్ భేటీ అయ్యారు. ప్రస్తుతం యాపిల్ కు అతిక్లిష్టంగా ఉన్న చైనీస్ మార్కెట్ ను అర్థం చేసుకోవడానికి ఈ పెట్టుబడులు దోహదం చేస్తాయని యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ తెలిపారు. ఇతతర్రా యాప్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ లతో కూడా టిమ్ కుక్ భేటీ అయ్యారు.    
 

మరిన్ని వార్తలు