ఇండియాలో ఐఫోన్-7

8 Oct, 2016 01:19 IST|Sakshi
ఐఫోన్ కోసం బారులు తీరిన కస్టమర్లు

నోయిడా: టెక్నాలజీ దిగ్గజ కంపెనీ యాపిల్ ప్రతిష్టాత్మకంగా గత నెల మార్కెట్‌లో ఆవిష్కరించిన ఐఫోన్-7 హ్యాండ్‌సెట్స్ ఎట్టకేలకు శుక్రవారం నుంచి భారతీయులకు అందుబాటులోకి వచ్చాయి. వీటి విక్రయాలు భారత్‌లో ప్రారంభమయ్యాయి. సిల్వర్, గోల్డ్, రోజ్ గోల్డ్, బ్లాక్ రంగుల్లో లభ్యంకానున్న ఈ ఐఫోన్ మొబైళ్లను 32 జీబీ, 128 జీబీ, 256 జీబీ అనే మూడు వేరియంట్లలో వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్-7, 7 ప్లస్ హ్యాండ్‌సెట్స్ ప్రారంభ ధర రూ.60,000గా ఉంది.

ఐఫోన్ యూజర్లకు జియో ఆఫర్
రిలయన్స్ జియో తాజాగా ఐఫోన్ యూజర్లకు ఒక ఆఫర్ ను ప్రకటించింది. రిలయన్స్ రిటైల్ లేదా యాపిల్ స్టోర్ నుంచి కొత్తగా ఐఫోన్‌ను కొనుగోలు చేసి జియో కనెక్షన్‌ను ఉపయోగిస్తున్న వారు ఈ ఏడాది 31 వరకు జియో వెల్‌కమ్ ఆఫర్‌ను ఉచితంగా పొం దొచ్చు. అటుపై అంటే జనవరి 1 నుంచి ఈ ఐఫోన్ యూజర్లందరికీ జియో కంపెనీ రూ.1,499 ప్లాన్‌ను ఏడాదిపాటు ఉచితంగా అందిస్తోంది. ఈ ప్లాన్‌లో అపరిమిత లోకల్, ఎస్‌టీడీ వాయిస్ కాలింగ్, నేషనల్ రోమింగ్ వంటి ఈ సేవల విలువ రూ.18,000 వరకు ఉండొచ్చని అంచనా.
                                                      మొదటి ఐఫోన్‌ను సొంతం చేసుకున్న యువతి

మరిన్ని వార్తలు