బడ్జెట్‌ ఎఫెక్ట్‌: పెరిగిన ఐఫోన్‌ ధరలు

2 Mar, 2020 20:19 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ఐఫోన్‌ ధరలు స్వల్పంగా పెంచినట్లు ప్రముఖ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ కంపెనీ వెల్లడించింది. ఇటీవల ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్డెట్‌లో  దిగుమతి సుంకాలను పెంచినందు వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కాగా యాపిల్‌ కంపెనీ ధరల పెంపు నిర్ణయం వల్ల పలు మోడళ్ల ధరలు రూ.1300 వరకు పెరగనున్నాయి. తాజాగా పెరిగిన ధరల ప్రకారం ఐఫోన్‌ 11 ప్రోమాక్స్‌ 64 జీబీ వేరియంట్‌ ధర రూ.1,11,200గా, 256 జీబీ వేరియంట్‌ ధర రూ.1,25,200గా ఉండనుంది. (ఉచితంగా 2 వేల ఐఫోన్ల పంపిణీ!)

ఐఫోన్‌ 11 ఫ్రో, ఐఫోన్‌ 8 తదితర మోడళ్ల ధరలు పెరిగాయి. ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 7, యాపిల్‌ వాచ్‌ ధరలలో ఎలాంటి మార్పు  లేదని కంపెనీ తెలిపింది. దేశంలో యాపిల్‌ కంపెనీ అనేక నూతన సర్వీసులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుందని  కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. పన్ను మార్పుల వల్ల విదేశాల నుంచి దిగుమతవుతున్న ఉత్పత్తులు ధరలపై ప్రభావం చూపుతున్నాయని కంపెనీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా  దేశంలో మొదటి ఆన్‌లైన్‌ స్టోర్‌ను ఆపిల్‌ కంపెనీ నిర్మించనున్నట్లు యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. (హీరోలు మాత్రమే ఐఫోన్లు వాడాలి!)

మరిన్ని వార్తలు