ఐఫోన్‌ 12 డిజైన్‌లో పెను మార్పు!

15 Jun, 2020 10:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూడిల్లీ : టెక్‌ దిగ్గజం ఆపిల్‌‌.. ఐఫోన్‌ 12 సిరీస్‌ డిజైన్‌లో పెను మార్పుకు శ్రీకారం చుట్టింది. మామూలుగా ఐఫోన్‌ 12 అంచులు గుండ్రంగా ఉండటం పరిపాటి. అయితే ఆ గుండ్రటి డిజైన్‌ స్థానంలో చదునైన అంచులను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం కొత్త డిజైన్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కొత్త సిరీస్‌ ఫోన్‌కు సంబంధించిన క్యాడ్‌ స్కెచెస్‌, మౌల్డ్స్‌ నెట్టించ చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోలను నిశితంగా పరిశీలిస్తే వాటి అంచులు చదునుగా ఉండటం మనం గుర్తించవచ్చు. ఈ కొత్త డిజైన్‌ ఐపాడ్‌ ప్రో డిజైన్‌కు దగ్గరగా ఉందని కొందరు నెటిజన్లు కామెంట్లు‌ చేస్తున్నారు. ( ‘ఆపిల్‌’లో లోపం కనిపెట్టి.. జాక్‌పాట్‌!)

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 12 ప్రో కొత్త మోడళ్లు

అంతేకాకుండా మ్యాక్‌లను కూడా ఇదే డిజైన్‌తో రూపొందించే అవకాశం ఉందని భావిస్తున్నారు. డిజైన్‌ విషయాన్ని పక్కన పెడితే.. ఐఫోన్‌ 12 లైన్‌లోని నాలుగు మోడళ్లు మూడు వేరు వేరు స్ర్కీన్‌ సైజుల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. యాపిల్‌ ఐఫోన్‌ 12.. 5.4, ఐఫోన్‌ 12 ప్రో, ఐఫోన్‌ 12 మ్యాక్స్‌ 6.1, ప్రీమియమ్‌ ఐఫోన్‌ 12 ప్రో మ్యాక్స్‌ 6.7 ఇంచుల డిస్‌ప్లేలతో లభించనున్నట్లు సమాచారం.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు