ఎలక్ట్రానిక్స్‌ తయారీ కేంద్రంగా భారత్‌

17 Sep, 2019 03:56 IST|Sakshi

యాపిల్, శామ్‌సంగ్‌ తదితర కంపెనీలకు కేంద్రం విజ్ఞప్తి

కేంద్ర మంత్రి ప్రసాద్‌  కీలక సమావేశాలు

న్యూఢిల్లీ: దేశంలో మొబైల్‌ ఫోన్ల తయారీని మరింత విస్తృతం చేయాలని, మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచి్చంది. అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితులు ఉన్నా భారత ఆరి్థక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నా యని పేర్కొంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)/ విదేశీ మారక నిల్వలు దండిగా ఉన్నాయంటూ, వీటిని తమ ఆరి్థక రంగ బలానికి నిదర్శనంగా చూపించారు. యాపిల్, డెల్, ఒప్పో, శామ్‌సంగ్, తదితర దిగ్గజ ఎల్రక్టానిక్స్, మొబైల్‌ కంపెనీల సీఈవోలతో కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సోమవారం ఢిల్లీలో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. భారత్‌ తయారీకి అంతర్జాతీయ కేంద్రంగా నిలుస్తోందని పేర్కొంటూ, భారత్‌ పట్ల మరింత శక్తితో, నిబద్ధతతో వ్యవహరించాలని వారిని కోరారు. కేవలం మొబైల్, ఆటోమోటివ్‌ ఎల్రక్టానిక్స్‌లోనే కాకుండా వ్యూహాత్మక, రక్షణ, వైద్య సంబంధిత ఎల్రక్టానిక్స్, రోబోటిక్స్‌పైనా పెట్టుబడులు పెంచాలని మంత్రి వారికి పిలుపునిచ్చారు. భారత్‌ను అంతర్జాతీయ ఎగుమతులకు కేంద్రంగా చేసుకోవాలని కోరారు.

5జీతో వృద్ధి మరింత పరుగు
వృద్ధి అనుకూల ప్రభుత్వం, పెట్టుబడులకు అనుకూల విధానాలు, భారత మార్కెట్‌ బలం, నైపుణ్య మానవ వనరులు, డిజిటల్‌ సామర్థ్యాలు కలిగిన భారత్‌.. ఎల్రక్టానిక్స్‌ తయారీ, ఎగుమతుల కేంద్రంగా అవతరిస్తుందన్న నమ్మకాన్ని మంత్రి వ్యక్తం చేశారు. 2025 నాటికి 400 బిలియన్‌ డాలర్ల (రూ.28.43 లక్షల కోట్లు) ఎలక్ట్రానిక్స్‌ తయారీ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని కేంద్రం విధించుకున్న విషయం గమనార్హం. వృద్ధికి 5జీ నూతన సరిహద్దుగా పేర్కొన్నారు. 5జీ విజ్ఞాన ఆధారిత ఆరి్థక వ్యవస్థగా అవతరించాలని భారత్‌ కోరుకుంటోందన్నారు.

మరిన్ని వార్తలు