ఐఫోన్‌ ఎక్స్‌లో లోపం : డివైజ్‌ రీప్లేస్‌

8 May, 2018 11:36 IST|Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో : ప్రముఖ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ తన అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్‌ ఎక్స్‌లో తీసుకొచ్చిన అత్యుత్తమ లాకింగ్‌ ఫీచర్  ఫేస్‌ ఐడీ‌. ఫింగర్‌ప్రింట్‌తో పోలిస్తే అత్యంత భద్రతతో కూడుకున్నదిగా దీన్ని ఆపిల్‌ అభివర్ణించింది. అయితే ప్రస్తుతం ఈ ఫేస్‌ఐడీకి సంబంధించే ఆపిల్‌ సమస్యలు ఎదుర్కొంటోంది. ఎవరైతే ఫేస్‌ఐడీ అన్‌లాక్‌ స్కానర్‌తో సమస్యలు ఎదుర్కొంటున్నారో వారి డివైజ్‌ను కొత్త దానితో రీప్లేస్‌ చేయనున్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఫోన్‌ను రిఫైర్‌ చేయలేని పక్షంలో వారికి ఈ కొత్త డివైజ్‌ను అందించనున్నట్టు రిపోర్టులు తెలిపాయి. మ్యాక్‌రూమర్స్‌ రిపోర్టు ప్రకారం ఫేస్‌ఐడీతో సమస్యలు ఎదుర్కొంటున్న ఐఫోన్‌ ఎక్స్‌ యూనిట్ల సర్వీసు పాలసీని అప్‌డేట్‌ చేస్తున్నట్టు ఈ కూమర్టినో కంపెనీ ప్రకటించినట్టు తెలిసింది. 

ఈ పాలసీ ప్రకారం ఫేస్‌ఐడీ సమస్యను తొలుత వెనుక కెమెరాతో పరిష్కరించడానికి చూస్తామని తెలిపింది. ఒకవేళ అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే, ఆపిల్‌ మొత్తం యూనిట్‌ను కొత్త డివైజ్‌తో రీప్లేస్‌ చేస్తుందని పేర్కొంది. డివైజ్‌ వెనుక కెమెరా ద్వారా ఈ సమస్య వస్తున్నట్టు ఈ టెక్‌ దిగ్గజం ఒప్పుకున్నట్టు డైలీ టెలిగ్రాఫ్‌ రిపోర్టు చేసింది. ముందు వైపు ఉన్న ట్రూడెప్త్‌ కెమెరా, వెనుక వైపు ఉన్న టెలిఫోటో లెన్స్‌ లింక్‌ అయి ఉన్నాయని రిపోర్టు తెలిపింది. ఆపిల్‌ అందించిన ఈ ఫేస్‌ఐడీ ఫీచర్‌, ఏ11 న్యూరల్‌ ఇంజిన్‌లో ట్రూ డెప్ట్‌ కెమెరా సిస్టమ్‌తో ఎనాబుల్‌ అయింది. ఇది 3డీ ఫేస్‌ స్కానర్‌. ఇది ఒక వ్యక్తి యొక్క ముఖాన్ని విశ్లేషించడానికి, గుర్తింపును ధృవీకరించడానికి అనేక అంశాలను ఉపయోగిస్తుంది. 

మరిన్ని వార్తలు