కొత్త సెక్యూరిటీతో ‘ఐఫోన్లు’

6 Aug, 2019 20:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన మొబైల్‌ ఫోన్లుగా ప్రసిద్ధి చెందిన ‘ఐఫోన్లు’ మరింత భద్రతతో వినియోగదారుల ముందుకు రాబోతున్నాయి. ‘అండర్‌ స్క్రీన్‌ ఫింగర్‌ ప్రింట్‌’ సెన్సార్లతో ఐఫోన్లు 2021 నాటికి మార్కెట్‌లోకి వస్తున్నాయని ప్రముఖ పారిశ్రామిక విశ్లేషకుడు మింగ్‌ చీ కూ తెలిపారు. ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నట్లు ఐఫోన్ల యాజమాన్యం 2017లోనే పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. అప్పటి నుంచి అడపా దడపా ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఐఫోన్ల భద్రతకు ఇంతకుముందు ‘టచ్‌ఐడీ’ పద్ధతి ఉండేది. స్క్రీన్‌కు దిగువన సెట్‌పైన ఫింగర్‌ ప్రింట్‌ ద్వారా ఫోన్‌ను లాక్, అన్‌లాక్‌ చేసే వెసులుబాటు ఉండేది. ఆ తర్వాత ఐఫోన్లతో ‘ఫేస్‌ఐడీ’ పద్ధతి వచ్చింది. ఆ తర్వాత 8 ప్లస్‌ సిరీస్‌ నుంచి ఈ ఫింగర్‌ ఐడీని తీసివేసి ఒక్క పేస్‌ఐడితో ఐఫోన్లు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ‘ఇన్‌స్క్రీన్‌ ఫింగర్‌ ప్రింట్‌ ఐడీ (స్క్రీన్‌ మీద వేలి ముద్రను రిజిస్టర్‌ చేయడం ద్వారా)’ సౌకర్యంతో ఐఫోన్లు వస్తున్నాయట. ఈ పద్ధతిని చైనా సంస్థ అప్పో ‘రెనో హాండ్‌ సెట్‌’ను ఇదే సౌకర్యంతో తీసుకొచ్చింది. ఆ తర్వాత శ్యామ్‌సంగ్, షావోమీ, హూవీ కంపెనీలు తీసుకొచ్చాయి.

మరిన్ని వార్తలు