ఇంటెల్‌‌కు త్వరలో ‌యాపిల్ గుడ్‌‌బై?

20 Jun, 2020 19:47 IST|Sakshi

ముంబై: టెక్‌ దిగ్గజాలు ఇంటెల్‌, యాపిల్‌ సంయుక్తంగా ప్రపంచానికి ఎన్నో కొత్త ఆవిష్కరణలు అందించాయి. ప్రస్తుతం కంప్యూటర్‌ తయారీలో యాపిల్‌ సంస్థ ఇంటెల్‌ మైక్రోప్రాసెసర్‌లను ఉపయోగిస్తుంది. అదే విధంగా యాపిల్‌ సంస్థ అత్యాధునిక చిప్‌లను రూపొందిస్తుంది. సొంతంగా ఎదగాలనే వ్యూహంతో మరో టెక్‌ దిగ్గజాం ఇన్‌టెల్‌తో విడిపోవాలని యాపిల్‌ సంస్థ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా త్వరలో యాపిల్‌ సంస్థ రూపొందించే సరికొత్త ఆవిష్కరణల ప్రణాళికను వివరిస్తామని సంస్థ వర్గాలు తెలిపాయి. ప్రపంచ వ్యాప్తంగా విభిన్న ఫీచర్లతో అత్యాధునిక స్మార్ట్‌ఫోన్(ఐఫోన్‌)‌లను రూపొందించి కోట్లాది వినియోగదారులను యాపిల్‌ ఆకట్టుకుంది. ‌కానీ యాపిల్‌ సంస్థ సొంతంగా నిలదొక్కుకునే వ్యూహాలు రచిస్తుంది.

ఇటీవల ట్రక్కుల తయారీలో ఈకామర్స్‌ దిగ్గజం అమోజాన్‌ ప్రవేశించిన విషయం విదితమే. మరోవైపు అన్ని దేశాల సాంకేతికతలను ఉపయోగించుకొని సరికొత్త ఆవిష్కరణలకు యాపిల్‌ సంస్థ వ్యూహాలు రచిస్తుంది. యాపిల్‌ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ ఐఫోన్లకు సరికొత్త చిప్‌ల ఆవిష్కరణలో కీలక పాత్ర పోషించిన విషయం విదితమే. మరోవైపు అత్యాధునిక సాంకేతికతతో దిగ్గజ కంపెనీలు సొంతంగా ఎదగాలనే వ్యూహాలు రచిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: శాంసంగ్‌కు బై, ఆపిల్‌కు సై : వారెన్‌ బఫెట్)‌

మరిన్ని వార్తలు