ఆపిల్‌ మాక్‌బుక్‌ ప్రో బ్యాటరీ పేలుతుంది..!

21 Jun, 2019 10:32 IST|Sakshi

వేడెక్కుతున్న 15 అంగుళాల మాక్‌ బుక్‌ ప్రో బ్యాటరీలు

భారీగా రీకాల్‌ చేస్తున్న ఆపిల్‌

వినియోగదారులకు హెచ్చరికలు

శాన్‌ఫ్రాన్సిస్కో :  సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ ఆపిల్‌ ఇటీవల విడుదల చేసిన మాక్‌బుక్‌ ప్రో డివైస్‌లు  పేలుతున్నాయిట. ఈ నేపథ్యంలోనే మాక్‌బుక్‌ ప్రో యూనిట్లను  ఆపిల్‌ కంపెనీ భారీగా రీకాల్‌  చేస్తోంది. 15 అంగుళాల మాక్‌బుక్ ప్రో బ్యాటరీ  ఓవర్‌ హీట్‌  అయ్యి  ప్రమాదానికి  గురుకావచ్చనే ఆందోళనతో వాటిని రీకాల్‌ చేస్తోంది. ఈ మేరకు వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రభావితమైన 15 అంగుళాల మాక్‌బుక్ ప్రో యూనిట్లను ఉపయోగించడం మానేయాలని ఆపిల్ వినియోగదారులను  కోరింది. అలాగే వీటి  బ్యాటరీని ఉచితంగా రీప్లేస్‌ చేసుకోవచ్చని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది

రెటినా డిస్‌ప్లే ఉన్న 15-అంగుళాల మాక్‌బుక్ ప్రో యూనిట్లు, ప్రధానంగా సెప్టెంబర్ 2015- ఫిబ్రవరి 2017 మధ్య అమ్ముడైనవి ప్రమాదానికి గురయ్యే అవకాశం వుందని  హెచ్చరించింది.  బ్యాటరీ రీప్లేస్‌మెంట్‌ వివరాల కోసం  ‘ఆపిల్.కామ్/సపోర్ట్ /15-ఇంచ్-మ్యాక్‌బుక్-ప్రో-బ్యాటరీ-రికాల్‌ ’  సంప్రదించవచ్చని  ప్రకటించింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు