ఆపిల్‌ నుంచి కొత్త ఐఫోన్‌, మనకే ఫస్ట్‌

23 Nov, 2017 16:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : టెక్‌ దిగ్గజం ఆపిల్‌ అమెరికా, ఇతర యూరోపియన్‌ దేశాల కంటే ముందస్తుగా మొట్టమొదటిసారి భారత్‌లో ఓ సరికొత్త ఐఫోన్‌ను లాంచ్‌ చేయబోతుంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నట్టు తైవాన్‌ ఎకనామిక్‌ డైలీ న్యూస్‌ రిపోర్టు చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్‌ ఎస్‌ఈకి చెందిన రెండో తర స్మార్ట్‌ఫోన్‌ అని పేర్కొంది. దీని పేరు ఐఫోన్‌ ఎస్‌ఈ2గా తెలిపింది. విస్ట్రోన్‌ కార్పొరేషన్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న కూపర్టినోకి చెందిన ఈ దిగ్గజం, బెంగళూరులో ఐఫోన్‌ ఎస్‌ఈ2  స్మార్ట్‌ఫోన్‌ను అసెంబుల్‌ చేస్తుందని రిపోర్టు చేసింది.

తైవనీస్‌ వెబ్‌సైట్‌ ఫోకస్‌ తైవాన్‌ కూడా ఐఫోన్‌ ఎస్‌ఈకి చెందిన తర్వాతి తరం స్మార్ట్‌ఫోన్‌ను 2018 ప్రథామర్థంలో తీసుకురాబోతుందని రివీల్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మేడిన్‌ ఇండియా ఐఫోన్‌గా పేర్కొంది. ఆన్‌లైన్‌లో వచ్చిన రిపోర్టుల ప్రకారం ఆపిల్‌ ఐఫోన్‌ ఎస్‌ఈ కంపెనీకి చెందిన స్వంత ఏ10 ఫ్యూజన్‌ చిప్‌సెట్‌తో రూపొందుతుందని, రెండు స్టోరేజ్‌ ఆప్షన్లు 32జీబీ, 128జీబీ వేరియంట్లలో ఇది లభ్యం కాబోతుందని తెలుస్తోంది. 12 ఎంపీ రియర్‌ కెమెరా, 5 ఎంపీ సెకండరీ కెమెరా, 2జీబీ ర్యామ్‌, 1700 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ ఫీచర్లుగా తెలుస్తున్నాయి. ఒరిజినల్‌ ఐఫోన్‌ ఎస్‌ఈ భారత్‌లో 2016 ఏప్రిల్‌లో లాంచ్‌ అయింది. 

మరిన్ని వార్తలు