నిర్మాణ రంగానికి ఊతం

27 Apr, 2019 00:13 IST|Sakshi

1. ముందే విద్యుత్, నీటి కనెక్షన్ల దరఖాస్తు.. 
గతంలో నిర్మాణం పూర్తయి ఓసీ వచ్చిన తర్వా తే వాటర్‌ వర్క్స్, ట్రాన్స్‌కో విభాగాల కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. కానీ, తాజా నిబంధనతో ఓసీ రాకముందే డెవలపర్లు విద్యుత్, వాటర్‌ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కనెక్షన్లు మాత్రం ఓసీ మంజూరయ్యాకే ఇస్తారు.  కొన్ని చోట్ల వాటర్‌ వర్క్స్‌ విభాగానికి పూర్తి స్థాయిలో నల్లా లైన్స్‌ లేవు. టెండర్లు పిలవటం, పనులు పూర్తవటం వంటి తతంగమంతా జరగడానికి 3–9 నెలల సమయం పట్టేది. ఈ లోపు నిర్మాణం పూర్తయినా సరే కస్టమర్లు గృహ ప్రవే శం చేయకపోయే వాళ్లు. ఎందుకంటే మౌలిక వసతులు లేవు కాబట్టి! కానీ, ఇప్పుడు దరఖాస్తు చేయగానే వెంటనే అధికారులు ఆయా ప్రాం తాల్లో కనెక్షన్లు ఉన్నాయా? లేవా? చెక్‌  చేసుకునే వీలుంటుంది. దీంతో నిర్మా ణంతో పాటూ వసతుల ఏర్పాట్లు ఒకేసారి జరుగుతాయి. 

2. వెంటిలేషన్స్‌లో గ్రీన్‌.. 
హరిత భవనాల నిబంధనల్లో ప్రధానమైనవి.. భవ న నిర్మాణాల్లో సాధ్యమైనంత వరకూ సహజ వనరుల వినియోగం. ఉదయం సమయంలో ఇంట్లో లైట్ల వినియోగం అవసరం లేకుండా సహజ గాలి, వెలుతురు వచ్చేలా గదుల వెంటిలేషన్స్‌ ఉం డాలి. అందుకే తాజాగా గదుల వెంటిలేషన్స్‌ గ్రీన్‌ బిల్డింగ్స్‌ నిబంధనలకు అనుగుణంగా ఉండాలనే నిబంధనలను తీసుకొచ్చారు. దీంతో ఇంట్లో లైట్లు, ఏసీల వినియోగం తగ్గుతుంది. ఫలితంగా కరెంట్‌ ఆదా అవుతుంది. నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుంది. 

3.  సెట్‌బ్యాక్స్‌ తగ్గింపు.. 
120 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో నిర్మించే భవనా ల చుట్టూ 20 మీటర్ల వెడల్పు ఖాళీ స్థలం వదిలితే సరిపోతుంది. గతంలో వీటికి సెట్‌బ్యాక్స్‌ 22.5 మీటర్లుగా ఉండేది. 55 మీటర్ల వరకూ ఎత్తు భవనాలకు గరిష్టంగా చుట్టూ వదలాల్సిన స్థలం 16 మీటర్లుగా ఉండగా.. ఆపై ప్రతి 5 మీటర్లకు 0.5 మీటర్ల ఖాళీ స్థలం పెరిగేది. కానీ, తాజా నిబంధనలతో 120 మీటర్ల ఎత్తు దాటితే గరిష్టంగా 20 మీటర్ల సెట్‌బ్యాక్‌ వదిలితే సరిపోతుంది. 

4. రోడ్ల విస్తరణకు స్థలం ఇస్తే.. 
నగరంలో రోడ్ల విస్తరణలో స్థలాల సమీకరణ పెద్ద చాలెంజ్‌. దీనికి పరిష్కారం చెప్పేందుకు, స్థలాలను ఇచ్చేవాళ్లను ప్రోత్సహించేందుకు నిబంధనల్లో మార్పు చేశారు. రోడ్ల విస్తరణకు ముందు ఉన్న విధంగానే భవనం నమూనా, ఒక అంతస్తు నుంచి మరొక అంతస్తుకు ఉన్న ఎత్తు సేమ్‌ అదేగా ఉండాల్సిన అవసరం లేదు. భవన నిర్మాణానికి అనుమతించిన విస్తీర్ణం మాత్రం గతం కంటే మించకుండా ఉంటే చాలు. 

5. టెర్రస్‌ మీద స్విమ్మింగ్‌ పూల్‌ 
ఇప్పటివరకు టెర్రస్‌ మీద స్విమ్మింగ్‌ పూల్స్‌ అనేవి స్టార్‌ హోటళ్లు, ప్రీమియం అపార్ట్‌మెంట్లలో మాత్ర మే కనిపించేవి. కానీ, తాజా  సవరణల్లో టెర్రస్‌ మీద స్విమ్మింగ్‌ పూల్‌ ఏర్పాటును చేర్చారు. అపార్ట్‌మెంట్‌ పైకప్పును పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చు. పైగా టెర్రస్‌ మీద స్విమ్మింగ్‌ పూల్, దాని కింది ఫ్లోర్‌లోనే క్లబ్‌ హౌస్‌ వంటి వసతులుంటా యి కాబట్టి కస్టమర్లు పూర్తి స్థాయిలో వసతులను వినియోగించుకుంటారు. అపార్ట్‌మెం ట్‌ చల్లగా ఉంటుంది. ఏసీ వినియోగం తగ్గు తుంది. నిర్వహణ పటిష్టంగా ఉన్నంతకాలం బాగుంటుంది.  – సాక్షి, హైదరాబాద్‌

ఇంపాక్ట్‌ ఫీజు సంగతేంటి? 
ఓసీ రాకముందే బీటీ, సీసీ రోడ్లు నిర్మా ణం పూర్తి చేయాలనే నిబంధనను తీసుకొ చ్చారు. ఇది ఆహ్వానించదగ్గదే. కానీ, ఎక్స్‌టర్నల్‌ డెవలప్‌మెంట్‌ కోసం వసూలు చేస్తున్న ఇంపాక్ట్‌ ఫీజును ఇందులో నుంచి మినహాయించాలనేది డెవలపర్ల డిమాండ్‌.  6 ఫ్లోర్ల తర్వాత నుంచి ఇంపాక్ట్‌ ఫీజుగా చ.అ.కు రూ.50 వసూలు చేస్తున్నారు. నిజానికి నిర్మాణ కార్యకలాపాలతో అభి వృద్ధి జరిగి ఆయా ప్రాంతాల్లో జనాభా పెరుగుతుంది కాబట్టి ఇంపాక్ట్‌ ఫీజులతో ఎక్స్‌టర్నల్‌ డెవలప్‌మెంట్స్‌ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ, తాజా నిబంధనల్లో ఎక్స్‌టర్నల్‌ డెవలప్‌మెంట్స్‌ కూడా నిర్మాణదారులే చేయాలి. ఆ తర్వాతే ఓసీ మంజూరు చేస్తామనడం సరైనది కాదు. ఇంపాక్ట్‌ ఫీజు ఎస్క్రో ఖాతాలో ఉంటుంది ఈ సొమ్ముతో డెవలపర్లు వసతులను ఏర్పా టు చేయాలి లేదా ఆయా ఖర్చును ఇంపాక్ట్‌ ఫీజు నుంచి మినహాయించాలి. 

మరిన్ని వార్తలు