తొలి 30 నిమిషాలు మాత్రమే...

1 Feb, 2018 11:49 IST|Sakshi

న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ గానీ, రాష్ట్రాల బడ్జెట్లు గానీ.. ఏవైనా సరే అవి కొనసాగినంత సేపు సదరు మంత్రులు నిలబడే తమ బడ్జెట్ ప్రసంగం మొత్తాన్ని చదువుతుంటారు. అయితే.. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్‌ ప్రవేశపెడుతూ వస్తున్న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ.. కూర్చుని తన బడ్జెట్‌ ప్రసంగాన్ని చదివే సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. ఎప్పటిలాగానే తొలుత నిల్చుని బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన తొలి 30 నిమిషాల అనంతరం కూర్చుని బడ్జెట్‌ ప్రసంగం కొనసాగించారు. మధ్యమధ్యలో మంచినీళ్లు తాగుతూ.. ఆయన కూర్చుని తన బడ్జెట్ వివరాలను చదివి వినిపిస్తున్నారు. నడుం నొప్పి తీవ్రంగా బాధిస్తుండటం వల్లే ఆయనిలా చేస్తున్నట్టు తెలుస్తోంది.

అంచనా వేసిన విధంగానే బడ్జెట్‌లో మొట్టమొదట రైతుల కోసం తీసుకోయే సంస్కరణలపై ప్రసంగించారు. ఈ ఏడాది అగ్రకల్చర్‌ రూరల్‌ ఎకానమీపై ఎక్కువగా దృష్టిసారించనున్నట్టు మంత్రి చెప్పారు. రాబోతున్న ఎన్నికల నేపథ్యంలో రైతులను, గ్రామీణ ప్రజానీక ఓట్లను దృష్టిలో పెంచుకుని కనీస మద్దతు ధరపై శుభవార్త చెప్పారు. ఈ రబీ పంటల నుంచి కనీస మద్దతు ధర.. ఉత్పాదన వ్యయానికంటే 150 శాతం అధికంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ప్రపంచంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారత్‌ ఉందన్నారు.

మరిన్ని వార్తలు