స్పాట్ మార్కెట్లో మరింత పెరిగిన బంగారం

13 Feb, 2016 11:40 IST|Sakshi
స్పాట్ మార్కెట్లో మరింత పెరిగిన బంగారం

ముంబై: అంతర్జాతీయ ట్రెండ్ ఫలితంగా ముంబై బులియన్ మార్కెట్లో శుక్రవారం పసిడి ధర మరింత పెరిగింది. గురువారం రాత్రి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఫ్యూచర్స్ ధర రూ. 30,000 దాటినప్పటికీ, శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో ఇది తగ్గింది. దాంతో ముంబై స్పాట్ మార్కెట్లో  మేలిమి బంగారం పది గ్రాముల ధర మరో రూ. 275 మాత్రమే పెరిగి రూ. 29,260 వద్ద, ఆభరణాల బంగారమూ అంతే పెరుగుదలతో రూ. 29,110 వద్ద ముగిసింది. ఇది 20 నెలల గరిష్టానికి ఎగిసింది. ఇక వెండి రేటు కేజీకి రూ. 175 పెరిగి రూ. 38,175కి చేరింది. అటు ఢిల్లీలో రూ. 850 మేర పెరిగి రూ. 29,650 వద్ద ముగిసింది. 2014 మే 16 తర్వాత ఈ స్థాయిలో ముగియడం ఇదే ప్రథమం. న్యూయార్క్ ట్రేడింగ్‌లో కడపటి సమాచారం అందేసరికి ఔన్సు పుత్తడి ధర క్రితం ముగింపుకంటే 13 డాలర్లు క్షీణించి 1,235 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
 

మరిన్ని వార్తలు