శ్రీసిటీలో ఆసస్ మొబైల్స్ తయారీ

1 Oct, 2015 23:56 IST|Sakshi
శ్రీసిటీలో ఆసస్ మొబైల్స్ తయారీ

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న తైవాన్ కంపెనీ ఆసస్ టెక్నాలజీస్ మేక్ ఇన్ ఇండియా బాట పట్టింది. కాంట్రాక్ట్ తయారీలో ఉన్న ఫాక్స్‌కాన్‌తో చేతులు కలిపింది. ఆంధ్రప్రదేశ్ శ్రీసిటీలో ఉన్న ఫాక్స్‌కాన్ ప్లాంటులో ఆసస్ మొబైల్స్ రూపొందనున్నాయి. ఆసస్ జెన్‌ఫోన్ స్మార్ట్‌ఫోన్లకు దేశీయంగా డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో తయారీ ప్లాంటు ఉండాలన్న తలంపుతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంటది. ప్లాంటులో నెలకు 1.5 లక్షల ఫోన్లను ఉత్పత్తి చేస్తారు. తొలుత జెన్‌ఫోన్ 2 లేసర్, జెన్‌ఫోన్ గో మోడళ్లు తయారు కానున్నాయి. డిసెం బర్ నాటికి జెన్‌ఫోన్ సెల్ఫీ మోడల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. లెనోవో, షావొమీ, జియోనీ ఫోన్లు సైతం ఫాక్స్‌కాన్ శ్రీసిటీ ప్లాంటులోనూ తయార వుతున్న సంగతి తెలిసిందే.
 
 5 శాతం వాటా లక్ష్యం..
 స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట ్లలో భారత్ ఒకటి. ఇక్కడి మార్కెట్‌పై ఆసస్ భారీ అంచనాలు పెట్టుకుంది. కంపెనీ ఆఫర్ చేస్తున్న మోడళ్ల వ్యూహాత్మక ధరల కారణంగా 2016 మార్చినాటికి భారత స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో 5 శాతం వాటాను లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం మార్కెట్ వాటా 2 శాతమున్నట్టు కంపెనీ చెబుతోంది. భారత్‌లో తాము విక్రయిస్తున్న ఫోన్లలో 80 శాతం దేశీయంగా తయారు చేయాలన్నది ప్రణాళిక అని ఆసస్ దక్షిణాసియా హెడ్ పీటర్ చాంగ్ తెలిపారు. మంచి ఫీచర్లు, డిజైన్ కోరుకునేవారికి అత్యుత్తమ మోడళ్లను అందుబాటు ధరలో అందిస్తామన్నారు. భారత్‌లో తయారీ చేపట్టడం వల్ల వ్యయం 3 శాతం తగ్గుతుందని చెప్పారు.

>
మరిన్ని వార్తలు