ఆసుస్‌ జెన్‌ఫోన్‌: ఫ్లిప్‌కార్ట్‌, వోడాఫోన్‌ కిల్లర్‌ డీల్స్‌

23 Apr, 2018 14:23 IST|Sakshi
ఆసుస్‌ జెన్‌ఫోన్‌ లాంచింగ్‌ ఫోటో

సాక్షి, న్యూఢిల్లీ: షావోమి, మోటరోలా లాంటి దిగ్గజ కంపెనీలకు షాకిచ్చేలా ఆసుస్‌ కంపెనీ సోమవారం లాంచ్‌ చేసిన  తాజా స్మార్ట్‌ఫోన్‌పై   వోడాఫోన్‌ నెట్‌వర్క్‌ ద్వారా  బంపర్‌ ఆఫర్లు అందిస్తోంది.  అలాగే ఆన్‌లైన్‌ రీటైలర్‌ ఫ్లిప్‌కార్ట్‌  అందిస్తున్న కిలర్స్‌ డీల్స్‌ కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. జెన్‌ ఫోన్‌ మాక్స్‌  ప్రో ఎం 1 3జీబీ ర్యామ్‌/32జీబీ స్టోరేజ్‌  రూ. 10,999 ధరలో,  4జీబీ ర్యామ్‌/64 జీబీ రూ. 12,999గాను  నిర్ణయించింది.  డీప్‌ సీ బ్లాక్‌, గ్రే రంగుల్లో   కస్టమర్లకు  అందుబాటులో ఉంటాయి. మాక్స్‌ బాక్స్‌  పేరుతో   మరో అదనపు బహుమతి కూడా ఉంది. స్పీకర్‌ సౌండ్‌ ఈ  డివైస్‌ రెండు  రెట్లు పెంచుతుందని కంపెనీ వెల్లడించింది.  

వోడాఫోన్‌  కిల్లర్‌ డీల్‌: వోడాఫోన్‌ భాగస్వామ్యంతో ఈ స్మార్ట్‌ఫోన్‌  కొనుగోలుపై 3200 రూపాయల  దాకా అదనపు డేటా ప్రయోజనాలను  ప్రకటించింది. రూ. 199 ప్రీపెయిడ్‌ ప్యాకేజీలు వాడే వోడాఫోన్‌ యూజర్లకు అదనంగా 10జీబీ డేటా ఒక సంవత్సరం మొత్తం ఫ్రీ.  రూ. 499  ప్యాకేజీలపై  వోడాఫోన్‌ రెండు సంవత్సరాలపాటు10జీబీ అదనపు  డేటా ఉచితం. మ

6జీబీ వెర్షన్‌:  6 జీబీ వెర్షన్‌ను కూడా త్వరలోనే లాంచ్‌ చేయనున్నట్టు కూడా కంపెనీ చెప్పింది.ముఖ్యంగా ఫ్రంట్‌ అండ్‌ రియర్‌  కెమెరాలను 16ఎంపీకి అప్‌గ్రేడ్‌ చేసి,  ధరలో   రూ.14999 గా ఉంటుంది.  ఇది కూడా  ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో  మే 3వ తేదీనుంచి విక్రయానికి  లభ్యం. 
ఫ్లిప్‌కార్ట్‌ కిల్లర్‌ డీల్‌: కేవలం  రూ.49లకే  కంప్లీట్‌ మొబైల్‌ ప్రొటెక్షన్‌ అందిస్తోంది.   హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌,  స్క్రీన్‌ డ్యామేజ్‌, లిక్విడ్‌ డ్యామేజ్‌ ఏదైనా సంవత్సరం పాటు  ఫ్రీ సర్వీసు.  అంతేకాదు  ఏదైనా మరమ్మతు చేయాల్సి  వస్తే..  వినియోగదారుని ఇంటినుంచే ఫోన్‌ పికప్‌ చేసుకుని రిపేర్‌ చేస్తామని ప్రకటించింది.. ఒక వేళ  10రోజుల్లో  ఫోన్‌ రిపేర్‌ సాధ్యం కాకపోతే ఫోన్‌ను రీప్లేస్‌ చేస్తామని ఫ్లిప్‌కార్ట్‌  ప్రతినిధి ప్రకటించారు. ఇంకా నో ఇఎంఐ కాస్ట్‌ సౌకర‍్యంతో పాటు సెలెక్ట్‌ మోడల్స్‌పై 1000 రూపాయల ఎక్సేంజ్‌ ఆఫర్‌ అందిస్తోంది.

జెన్‌ఫోన్‌  మాక్స్‌ ప్రొ ఎం1 ఫీచర్లు
5.99 స్క్రీన్‌ ఫుల్‌ వ్యూ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ ఓరియో 8.1
13 + 5 ఎంపీ రియర్‌ కెమెరా,
8 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌
5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

మరిన్ని వార్తలు