ఆందోళనకరంగా టోకు ధరల సూచి

14 Sep, 2017 13:38 IST|Sakshi

సాక్షి, ముంబై: ఆగస్ట్ నెల ద్రవ్యోల్బణం మరోసారి ఆందోళనకరస్థాయిలో రికార్డయింది. గురువారం వెల్లడైన  గణాంకాలు  ప్రకారం  ఆగస్టు నెల  టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యుపీఐ)3. 24 శాతం  నమోదైంది.  జూలైతో పోల్చితే భారీగా పెరిగి 3.24 శాతానికి పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం, ఇంధన ఉత్పత్తుల ధరలు పెరగడంతో నాలుగు నెలల గరిష్టాన్ని తాకింది. ఆహార ద్రవ్యోల్బణం 5.75గా  నమోదైంది.  

మరోవైపు టోకుధరల సూచి (డబ్ల్యుపీఐ)  గణాంకాలు, చమురు ద్రవ్యోల్బణం.. ఆహార ద్రవ్యోల్బణం గణాంకాలు నిరుత్సాహకరంగా వెలువడటంతో బెంచ్ మార్క్ ఇండెక్స్‌లు ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభంలో లాభాలతో జోష్‌గా ఉన్న మార్కెట్లు  నష్టాల్లోకి  జారుకున్నాయి. ముఖ్యంగా బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌,  ఐఓసీ తదితర ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ షేర్లు నష్టాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 32 పాయింట్ల లాభంతో 32,218 దగ్గర ఉండగా.. నిఫ్టీ 3పాయింట్ల నష్టంతో 10076 వద్ద కొనసాగుతున్నాయి. ట్రేడవుతోంది.

 

మరిన్ని వార్తలు