స్పెషాలిటీ ఉత్పత్తులపై  అరబిందో ఫోకస్‌ 

8 Jan, 2019 01:15 IST|Sakshi

అభివృద్ధి దశలో 147 ఉత్పాదనలు

హైదరాబాద్‌: ఔషధ రంగ సంస్థ అరబిందో ఫార్మా విభిన్న ప్రత్యేక ఉత్పత్తుల అభివృద్ధిలో నిమగ్నమైంది. ఆంకాలజీ, హార్మోన్స్, బయాలాజిక్స్, టాపికల్స్, నాసల్స్, పెప్టైడ్స్, ఇన్‌హేలర్స్, వ్యాక్సిన్స్‌ వంటి 147 ప్రొడక్టులు అభివృద్ధి దశలో ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. వీటి మార్కెట్‌ పరిమాణం రూ.8.27 లక్షల కోట్లు అని ఇన్వెస్టర్‌ ప్రెజెంటేషన్‌లో తెలిపింది.

కొత్త ఉత్పత్తుల ద్వారా ఆదాయం 2019–20 తొలి త్రైమాసికం నుంచి ప్రారంభం అవుతుంది. మూడేళ్లలో ఈ ప్రొడక్టులను యూఎస్‌ఎఫ్‌డీఏ వద్ద అరబిందో ఫైల్‌ చేయనుంది. 

మరిన్ని వార్తలు