మూడేళ్లలో రుణ రహిత కంపెనీగా అరబిందో

25 Nov, 2019 05:03 IST|Sakshi

హైదరాబాద్‌: ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా మూడేళ్లలో రుణ రహిత కంపెనీగా అవతరించనుంది. సాండోజ్‌ డీల్‌తో కంపెనీపై రుణ భారం పెరిగింది. నోవార్టిస్‌ కంపెనీ అయిన సాండోజ్‌ వాణిజ్య కార్యకలాపాలు, మూడు తయారీ ప్లాంట్లను అరబిందో ఫార్మా రూ.6,300 కోట్లు వెచ్చించి గతేడాది సెప్టెంబర్ లో కొనుగోలు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ భారం రూ.1,050–1,400 కోట్లు తగ్గుతుందని అరబిందో సీఎఫ్‌వో సంతానం సుబ్రమణియన్‌ తెలిపారు. గత మూడు త్రైమాసిక ఫలితాలనుబట్టి మూడేళ్లలో రుణ రహిత కంపెనీ అవుతుందని చెప్పారు. 2019 జూన్‌తో పోలిస్తే సెప్టెంబర్ నాటికి సంస్థ నికర రుణాలు రూ.497 కోట్లు తగ్గి రూ.3,654 కోట్లకు వచ్చి చేరాయి.

మరిన్ని వార్తలు