4.6% పెరిగిన అరబిందో లాభం

13 Nov, 2019 05:50 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా నికరలాభం పెరిగింది. సెప్టెంబర్‌ త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంలోని రూ.611.4 కోట్లతో పోలిస్తే 4.6 శాతం పెరిగి రూ.639.5 కోట్లుగా నమోదయింది. టర్నోవర్‌ రూ.4,751.4 నుంచి 18 శాతం వృద్ధితో రూ.5,600.6 కోట్లకు ఎగసింది. ‘‘అమెరికా, యూరప్‌ మార్కెట్లలో చక్కని వృద్ధి నమోదు కావటంతో ఈ త్రైమాసికంలోనూ ఆరోగ్యకరమైన ఫలితాలు సాధించాం.మా తొలి బయో సిమిలర్‌ ఉత్పాదనకు సంబంధించి వచ్చే ఏడాది మూడో త్రైమాసికంలో క్లినికల్‌ ట్రయల్స్‌ మొదలుపెడతాం’’ అని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.గోవిందరాజన్‌ చెప్పారు. రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.1.25 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. 

మరిన్ని వార్తలు