అరబిందో ఫార్మా లాభం 606 కోట్లు

15 Nov, 2016 00:52 IST|Sakshi
అరబిందో ఫార్మా లాభం 606 కోట్లు

33 శాతం అప్ రూ. 1.25 మధ్యంతర డివిడెండ్

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా నికర లాభం దాదాపు 33 శాతం ఎగిసి సుమారు రూ. 606 కోట్లకు (కన్సాలిడేటెడ్) చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో కంపెనీ లాభం సుమారు రూ. 454 కోట్లు. మరోవైపు, ఆదాయం రూ. 3,365 కోట్ల నుంచి రూ. 3,775 కోట్లకు పెరిగింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 1 ముఖవిలువ గల షేరు ఒక్కింటిపై రూ. 1.25 (సుమారు 125 శాతం) కంపెనీ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. అధునాతన సాంకేతికత ఊతంతో వైవిధ్యమైన ఉత్పత్తులను రూపొందించడం ద్వారా దీర్ఘకాలిక వృద్ధి సాధించే దిశగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు కంపెనీ ఎండీ ఎన్ గోవిందరాజన్ తెలిపారు.

 ఫార్ములేషన్‌‌స వాటా 80%..: మొత్తం ఆదాయాల్లో ఫార్ములేషన్‌‌స విభాగం వాటా 80 శాతంగా ఉంది. వివిధ వ్యాపార విభాగాల పనితీరు పరంగా చూస్తే.. ఫార్ములేషన్‌‌స విభాగం ఆదాయాలు 12 శాతం వృద్ధితో రూ. 3,004 కోట్లకు పెరగ్గా, ఏపీఐ విభా గం ఆదాయం దాదాపు 11% పెరుగుదలతో రూ. 769 కోట్లకు చేరింది. ఫార్ములేన్‌‌సకి సంబంధించి కీలకమైన అమెరికా మార్కెట్లో అమ్మకాలు సుమారు 18 శాతం పెరిగి రూ. 1,735 కోట్లుగా నమోదైంది. అమ్మకాల్లో సుమారు 3.9 శాతాన్ని పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల కోసం వ్యయం చేసినట్లు అరబిందో ఫార్మా తెలిపింది. విదేశీ మారక రుణ భారం ఈ ఏడాది మార్చిలో 640 మిలియన్ డాలర్లుగా ఉండగా.. సెప్టెంబర్ ఆఖరు నాటికి 484 మిలియన్ డాలర్లకు తగ్గినట్లు పేర్కొంది. సమీక్షాకాలంలో కొత్తగా 9 జనరిక్ ఔషధాల తయారీకి అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ)కు దరఖాస్తు చేసుకున్నట్లు సంస్థ వివరించింది. 17 ఉత్పత్తులకు అనుమతులు లభించినట్లు, 11 కొత్త ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు పేర్కొంది.

మరిన్ని వార్తలు