అరబిందో ఫార్మా లాభం రూ. 501 కోట్లు

31 May, 2014 01:36 IST|Sakshi
అరబిందో ఫార్మా లాభం రూ. 501 కోట్లు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం అరబిందో ఫార్మా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 501 కోట్ల నికర లాభం నమోదు చేసింది. క్రితం క్యూ4లో లాభం రూ. 109 కోట్లతో పోలిస్తే ఇది సుమారు అయిదు రెట్లు అధికం. మరోవైపు, ఆదాయం రూ. 1,570 కోట్ల నుంచి రూ. 2,330 కోట్లకు పెరిగింది. షేరుకి రూ. 1.75 చొప్పున మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది.

 అరబిందో ఫార్మాలో షేర్లు  విక్రయించిన మోర్గాన్ స్టాన్లీ
 కాగా అరబిందో ఫార్మాలో 17.32 లక్షల షేర్లను మోర్గాన్ స్టాన్లీ ఆసియా సింపూర్ సంస్థ ఓపెన్ మార్కెట్లో విక్రయించింది. షేరుకి రూ. 670 చొప్పున వీటి విలువ సుమారు రూ. 116 కోట్లు. 2014 మార్చి 31 నాటికి అరబిందో ఫార్మాలో మోర్గాన్ స్టాన్లీకి 46.16 లక్షల షేర్లు ఉన్నాయి. ఇవి సుమారు 1.58 శాతం వాటాకు సమానం. ఇంకో వైపు, మరో లావాదేవీలో అబు ధాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ అరబిందోలో 14.75 లక్షల షేర్లను దాదాపు రూ. 99 కోట్లకు కొనుగోలు చేసింది.

 శుక్రవారం బీఎస్‌ఈలో సంస్థ షేరు సుమారు 4.76 శాతం ఎగిసి రూ. 667.70 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు