లీజుకు షి‘కారు’!!

15 Jun, 2019 02:19 IST|Sakshi

డౌన్‌ పేమెంట్‌ లేకుండానే చేతికి కారు

హ్యుందాయ్‌ క్రెటాకు నెలకు రూ.17,640 చాలు

అదే స్కోడా సూపర్బ్‌ అయితే రూ.19,856

ఫియట్, జీప్‌ మోడళ్లను అందిస్తున్న ఎఫ్‌సీఏ ఇండియా

లీజు మోడల్‌ అమలు చేస్తున్న కార్ల కంపెనీలు

అమ్మకాలు పెంచుకునేందుకు కొత్త వ్యూహం

నిర్వహణ బాదరబందీలు కూడా మనకుండవు

పరిస్థితిని గమనిస్తున్నామన్న మారుతీ, టాటా  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో : డౌన్‌ పేమెంటేమీ లేకుండా నచ్చిన కారు చేతికొస్తే..!! అదీ నిర్వహణ, బీమా వంటి ఖర్చులు లేకుండా జస్ట్‌ నెలవారీ అద్దెతో!!. చాలామందికి ఇది నచ్చే వార్తే. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే ఇపుడు వాహన తయారీ కంపెనీలు కార్ల లీజింగ్‌ వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. కార్ల విక్రయాలు తగ్గుతున్న నేపథ్యంలో కస్టమర్లను ఆకట్టుకోవటానికి అవి లీజు మార్గాన్ని ఎంచుకుంటున్నాయి.  

లీజు ప్రయోజనం ఏంటంటే... 
కస్టమర్‌పై ముందస్తు (డౌన్‌ పేమెంట్‌) చెల్లింపు భారం ఉండదు. బీమా, రోడ్‌ ట్యాక్స్, యాక్సిడెంటల్‌ రిపేర్లు, మెయింటెనెన్స్‌ అంతా కార్ల కంపెనీయే చూసుకుంటుంది. ఓ ఐదేళ్ల పాటు నెలవారీ కంపెనీ నిర్దేశించిన సొమ్మును చెల్లిస్తే చాలు. ఐదేళ్ల తరువాత వాహనాన్ని తిరిగి కంపెనీకి అప్పగించాల్సి ఉంటుంది. అంతే!!. కాల పరిమితి, ఈఎంఐ మొత్తం అనేవి మోడల్‌ను బట్టి మారుతాయి. ఈ విధానంలో కంపెనీలు కనీసం 2 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు కార్లను లీజుకిస్తున్నాయి. లీజు పూర్తి కాకముందే కస్టమర్‌ మరో మోడల్‌కు అప్‌గ్రేడ్‌ కావొచ్చు కూడా!!. 

వినియోగదారు తనకు నచ్చిన మోడళ్లను తరచూ మార్చుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని వరుణ్‌ మోటార్స్‌ ఎండీ వరుణ్‌ దేవ్‌ చెప్పారు. లీజు విధానం ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోందన్నారు. 

రిటైల్‌ కస్టమర్లకు సైతం.. 
దేశీయంగా 2018–19లో అన్ని కంపెనీలూ కలిసి 33,77,436 ప్యాసింజర్‌ వెహికిల్స్‌ విక్రయించాయి. అంతకు ముందటేడాదితో పోలిస్తే వృద్ధి రేటు 2.7 శాతం మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–మే నెలలో విక్రయాలు ఏకంగా 19 శాతం పడిపోయాయి. బలహీన సెంటిమెంటు,  వాహన ధరలు పెరగడం, ఆర్జించే వ్యక్తులపై పన్ను భారం వంటివి దీనికి కారణాలుగా చెప్పొచ్చు. మరోవైపు ఉబెర్, ఓలా వంటి రైడ్‌ షేరింగ్‌ కంపెనీల కార్యకలాపాలు ద్వితీయ శ్రేణి నగరాలకూ విస్తృతమవుతున్నాయి. దీంతో అమ్మకాలు పెంచుకోవటానికి కంపెనీలు అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నాయి. ఇందులో లీజింగ్‌ ఒకటి. కార్పొరేట్‌ క్లయింట్లకు లీజుపై వాహనాలను దాదాపు అన్ని కంపెనీలు ఇస్తున్నాయి. ఈ మధ్య రిటైల్‌ కస్టమర్లకూ ఈ సేవల్ని విస్తరించాయి. ఓరిక్స్‌ ఆటో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఏఎల్‌డీ ఆటోమోటివ్, రెవ్‌ కార్స్‌ వంటి లీజింగ్‌ కంపెనీల భాగస్వామ్యంతో హ్యుందాయ్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, స్కోడా, ఎఫ్‌సీఏ ఇండియా ప్రస్తుతం ఈ రంగంలోకి వచ్చాయి. మారుతీ, టాటా వంటి సంస్థలూ త్వరలో వస్తామనే సంకేతాలిస్తున్నాయి. ‘లీజింగ్‌ విధానం మంచిదే. మార్కెట్‌ తీరుతెన్నులను గమనిస్తున్నాం’ అని మారుతి సుజుకి మార్కెటింగ్, సేల్స్‌ ఈడీ శశాంక్‌ శ్రీవాస్తవ చెప్పారు. 

తక్కువ ఖర్చుతో... 
ఉద్యోగులు, వృత్తి నిపుణులు, చిన్న, మధ్య తరహా కంపెనీలు కార్లను లీజుకు తీసుకోవచ్చు. నగరం, వాహనం మోడల్, కాల పరిమితిని బట్టి నెలవారీ లీజు మొత్తం మారుతుంది. అయిదేళ్ల కాల పరిమితిపై హ్యుందాయ్‌ శాంత్రో బేసిక్‌ మోడల్‌ కారు నెలవారీ అద్దె సుమారు రూ.7,670 ఉంది. క్రెటా విషయంలో రూ.17,640 చార్జీ చేస్తారు. ఇదే వర్షన్‌ క్రెటా కొనాలంటే డౌన్‌ పేమెంట్‌ రూ.2.7 లక్షలిచ్చాక, ఈఎంఐ రూ.18,900 దాకా అవుతోంది. ఇక మహీంద్రా కేయూవీ100ఎన్‌ఎక్స్‌టీ రూ.13,499, ఎక్స్‌యూవీ500 రూ.32,999లుగా నిర్ణయించారు. స్కోడా మోడల్‌ ప్రారంభ అద్దె రూ.19,856. ప్రస్తుతం సూపర్బ్‌ మోడల్‌ మాత్రమే ఈజీ బై కింద అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. ఫియట్, జీప్‌ మోడళ్లను ఎఫ్‌సీఏ ఇండియా లీజు కింద ఆఫర్‌ చేస్తోంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అజీం ప్రేమ్‌జీ అండతో ఆ స్టార్టప్‌ అరుదైన ఘనత

కార్పొరేట్‌ బ్రదర్స్‌ : అనిల్‌ అంబానీకి భారీ ఊరట

లాభాల్లోకి మార్కెట్లు : బ్యాంక్స్‌ జూమ్‌

రెడ్‌మి కే 20 ప్రొ వచ్చేసింది

రెడ్‌మి కే20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ : బిగ్‌ సర్‌ప్రైజ్‌

స్వల్ప లాభాలతో స్టాక్‌మార్కెట్లు

మార్కెట్లోకి ‘స్కోడా రాపిడ్‌’ లిమిటెడ్‌ ఎడిషన్‌

‘ఐటీఆర్‌ ఫామ్స్‌’లో మార్పుల్లేవ్‌..

ఇక ‘స్మార్ట్‌’ మహీంద్రా!

సు‘జలం’ @ 18.9 లక్షల కోట్లు!

విప్రోకు ఉజ్వల భవిష్యత్‌: ప్రేమ్‌జీ

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

నేటి నుంచీ కియా ‘సెల్టోస్‌’ బుకింగ్స్‌ ప్రారంభం

ఎక్కడైనా వైఫై కనెక్టివిటీ !

అశోక్‌ లేలాండ్‌ ప్లాంట్‌ తాత్కాలిక మూసివేత

కొనుగోళ్ల జోష్‌ : లాభాల్లోకి సూచీలు 

ఎయిరిండియాకు భారీ ఊరట

ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు

మందగమనానికి ఆనవాలు!

27 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి రేటు

జీవీకే ఎయిర్‌పోర్టులో 49% వాటా విక్రయం!

మార్కెట్లో ‘వాటా’ ముసలం!

మహిళల ముంగిట్లో డిజిటల్‌ సేవలు : జియో

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

లాభనష్టాల ఊగిసలాట

రెండేళ్ల కనిష్టానికి టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం

16 పైసలు ఎగిసిన రూపాయి

భారీ లాభాల్లో మార్కెట్లు : ఇన్ఫీ జూమ్‌

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ : భారీ ఆఫర్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!