అధిక వాహన ఉత్పత్తే అసలు సమస్య: రాహుల్‌ బజాజ్‌

12 Sep, 2019 02:21 IST|Sakshi

ముంబై: దేశీయ ఆటో రంగంలో ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణం ‘‘అధిక ఉత్పత్తి అలాగే అధికంగా స్టాకులు పేరుకుపోవడం’’ అని బజాజ్‌ ఆటో ఎండీ రాహుల్‌ బజాజ్‌ అభిప్రాయపడ్డారు. సంక్షోభానికి ఆర్థిక మందగమన ప్రభావం చాలా స్వల్పమన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జీఎస్‌టీ కోతలు అవసరం లేదన్నారు. ఇటీవల కాలంలో ఆటోమొబైల్‌ రంగంపై జీఎస్‌టీ తగ్గించాలని డిమాండ్‌ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నెల 20న జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో కోత విషయమై నిర్ణయం ఉండొచ్చని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఆటో ఇండస్ట్రీ భారత్‌ 6 నిబంధనలకు అనుగుణంగా మార్పు చెందుతోందని, నవంబర్‌ నాటికి పరిస్థితులు చక్కబడవచ్చని అంచనా వేశారు.

కరెక్షన్‌ లేకుండా ముందుకే సాగిపోయే పరిశ్రమ ఏదీ ఉండదని ఆయన చెప్పారు. ప్రస్తుతం కంపెనీలన్నీ దాదాపు అంతర్జాతీయ స్థాయిలో విక్రయాలు జరుపుతున్నందున, ఏదో ఒక దేశంలో మందగమనం మొత్తం కంపెనీపై ప్రభావం చూపే స్థితిలేదన్నారు. ఆటో విక్రయాల క్షీణతతో కేవలం 5– 7 శాతం మాత్రమే మందగమన ప్రభావంతో తగ్గి ఉంటాయన్నారు. ప్రతి పరిశ్రమకు ఉత్థానపతనాలు ఉంటాయని, సైకిల్స్‌ మారేందుకు సమయం పడుతుంటుందని వివరించారు. ఇప్పటి సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేరని, కానీ ఇప్పటికైతే జీఎస్‌టీ కోతల అవసరం లేదని అభిప్రాయపడ్డారు.  

స్వీయతప్పిదమే: నిజానికి ఆటో రంగంలో ఈ పరిస్థితికి కంపెనీలే ప్రధానకారణమని రాహుల్‌ విమర్శించారు. కంపెనీలు వృద్ధి అంచనాలు విపరీతంగా వేసుకొని అధిక ఉత్పత్తులు చేశాయన్నారు. లాజిక్‌ లేకుండా కంపెనీలు తీసుకున్న నిర్ణయాల ఫలితమే ఈ సంక్షోభమని దుయ్యబట్టారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఐదో రోజూ నిఫ్టీకి లాభాలు

ఆ అవ్వకు స్టవ్‌ కొనిస్తా: ఆనంద్‌ మహీంద్ర

ఈ జీతంతో బతికేదెలా..? బతుకు బండికి బ్రేక్‌..

జియో ఫైబర్‌కు దీటుగా ఎయిర్‌టెల్‌ ఎక్స్ర్టీమ్‌ ప్లాన్‌

తొలి బీఎస్‌-6 యాక్టివా125 లాంచ్‌

ఐటీ కంపెనీలపై సంచలన కేసు

జీడీపీకి ఫిచ్‌ కోత..

లాభాల్లో స్టాక్‌మార్కెట్లు 

క్షీణతకు ఓలా, ఉబెర్‌ కూడా కారణమే..

పేటీఎమ్‌ ‘యస్‌’ డీల్‌!

యాపిల్‌ ఐఫోన్‌ 11 వచ్చేసింది..

త్వరలో ఫోక్స్‌ వాగన్‌ ఎలక్ట్రిక్‌ కారు

వంద రోజుల్లో రూ 12.5 లక్షల కోట్లు ఆవిరి..

మ్యూచువల్‌ ఫండ్‌ నిధుల్లో 4 శాతం పెరుగుదల

లినెన్‌ రిటైల్‌లోకి ‘లినెన్‌ హౌజ్‌’

బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఆర్ధిక ప్యాకేజీ!

ఎన్‌హెచ్‌బీ ఆధ్వర్యంలో ఇంటర్‌మీడియరీ

హైదరాబాద్‌ వద్ద ఇన్నోలియా ప్లాంటు

ఫ్లిప్‌కార్ట్‌ నెట్‌వర్క్‌లోకి 27,000 కిరాణా స్టోర్లు

ఆంధ్రాబ్యాంక్‌ విలీనానికి ఓకే

ఆపిల్‌ ఫోన్లు లాంచింగ్‌ నేడే..

పీడబ్ల్యూసీపై సెబీ నిషేధానికి శాట్‌ నో

వాహన విక్రయాలు.. క్రాష్‌!

మళ్లీ 11,000 పైకి నిఫ్టీ..

‘బీమా’ సంగతేంటి..?

ఐటీ కంపెనీలో 10వేల ఉద్యోగాలు

దారుణంగా పడిపోయిన అమ్మకాలు : మరింత సంక్షోభం

లాభాల్లోకి మార్కెట్ల రీబౌండ్

పండుగ సీజన్‌ : రుణాలపై గుడ్‌ న్యూస్‌

సూపర్‌ వాటర్‌ ఫిల్టర్‌ : ధర రూ. 30

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రాకుమారుడు ఉన్నాడు

నా సినిమాల్లో మార్షల్‌ బెస్ట్‌

మరో టాక్‌ షో

రాత్రులు నిద్రపట్టేది కాదు

సాక్షి.. ఓ నిశ్శబ్ద చిత్రకారిణి

ఆ టెన్షన్‌లో కిక్‌ ఉంటుంది