ఆటో ఎక్స్‌పో సందడి షురూ: కార్ల జిగేల్‌.. జిగేల్‌

5 Feb, 2020 11:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  న్యూఢిల్లీ శివార్లలోని గ్రేటర్ నోయిడాలో ఆటో ఎక్స్‌పో 2020  సంరంభానికి తెరలేచింది.  ఫిబ్రవరి 7 నుంచి 12వ తేదీవరకు జరగనున్న ఈ వేడుకనలో ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు తమ తమ వాహనాలను ప్రదర్శనకు ఉంచుతాయి. ఈ   వేడుకకు ప్రారంభ సన్నాహకం గా ఫిబ్రవరి 5, 6 తేదీల్లో  మీడియాకోసం పలు వాహనాలు కొలువు దీరాయి. ముఖ్యంగా  మహీంద్ర, మారుతి సుజుకి, టాటా మోటార్స్‌, హ్యుందాయ్‌తో పాటో, ఫ్రెంచ్‌ తయారీ దారు రెనాల్ట్‌  తమ వాహనాలను ఆవిష్కరించాయి. మిషన్‌ గ్రీన్‌ మిలియన్‌ లో భాగంగా  రానున్న సంవత్సరాల్లో 10 లక్షల గ్రీన్ కార్లను ( సీఎన్‌జీ, హైబ్రిడ్‌, ఎలక్ట్రిక్‌) విక్రయించాలని లక్ష్యంగా  పెట్టుకున్నట్టు మారుతి వెల్లడించింది.  ఈ రోజు మారుతి సుజుకి ఇండియా ఈ రోజు ఆటో ఎక్స్‌పో 2020 లో ఫ్యూటురో-ఇ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది.

టాటామోటార్స్‌ ఫ్రీడం ఇన్‌ప్యూచర్‌ మొబిలిటీ అనే కాన్సెప్ట్‌తో 13 కార్లను ప్రదర్శించింది. 

దక్షిణకొరియా దిగ్గజం కియా మోటార్స్‌  ప్రీమియం సెగ్మెంట్‌లో మల్టీ పర్పస్‌ వెహికల్‌ కార్నివాల్‌ని  ఆటోఎక్స్‌పో 2020లో లాంచ్‌ చేసింది. దీంతోపాటు గ్లోబల్‌ ఎస్‌యూవీ ‘సోనెట్‌’ ను కూడా ప్రదర్శించింది. 

 2020 ఆటో ఎక్స్‌పోలో హ్యుందాయ్ ఇండియా లే ఫిల్ రూజ్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. 

మరిన్ని వార్తలు