ప్రేమికులు మెచ్చే: ‘ట్విజీ’ బుల్లి కారు

8 Feb, 2020 09:35 IST|Sakshi
రెనాల్ట్‌ మైక్రో ఎలక్ట్రిక్ వాహనం ‘ట్విజీ’

రెనాల్ట్‌ ‘ట్విజీ’ టూ సీటర్‌ బుల్లెట్‌

టాటా నానో కంటే చిన్నది

సాక్షి, న్యూఢిల్లీ: గ్రేటర్‌ నోయిడాలో15 వ ఎడిషన్‌గా కొనసాగుతున్న ఆటో ఎక్స్‌పో 2020లో  ఫ్రెంచ్‌ కార్ల తయారీ దారు రెనాల్ట్‌  ప్రేమికులను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన కారును  తీసుకొచ్చింది. ట్విజీ పేరుతో  మైక్రో ఎలక్ట్రిక్ వాహనం  ఈ వాలెంటైన్స్ డే సీజన్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. యూరోపియన్ మార్కెట్లో ట్విజీకి మంచి ఆదరణ  లభించిందని కంపెనీ తెలిపింది.

రెనాల్ట్‌  ట్విజీ  టాటా నానో కంటే చిన్నది. ఇద్దరు వ్యక్తులకు సరిపోతుంది. ఈ  టూ సీటర్‌  ట్విజీలో 6.1 కిలోవాట్‌ బ్యాటరీని అమర్చింది.  పూర్తిగా ఛార్జ్ చేయడానికి నాలుగు గంటలు పడుతుంది. ఒకసారి చార్జ్‌ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. విండ్‌స్క్రీన్, ఇరుకైన బాడీ, డోర్స్‌ , పనోరమిక్ సన్‌రూఫ్ ఇలా క్రేజీ లుక్స్‌తో ప్రేమికులనుఆకట్టుకోవడం ఖాయం. ఈ కారు సింగిల్ డిజిటల్ కన్సోల్‌ను  అమర్చారు. ఈ  కారును ఇండియాలో లాంచ్‌ చేసే ప్రణాళిలేవీ కంపెనీ  వెల్లడించలేదు. అయితే రెండవ సీటు చాలా ఇరుకుగా వుండటంతో ఆరడుగుల బులెట్‌లాంటి అబ్బాయిలకు,  పొడుగు కాళ్ల  సుందరిలకు  కొంచెం కష్టమే.   

 చదవండి : ఆటో ఎక్స్‌పో 2020 : టాప్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలుకొత్త ఇంజీన్‌తో ఆకర్షణీయంగా మారుతి ఇగ్నిస్‌

మరిన్ని వార్తలు