ఆటో ఎక్స్‌పో 2020: టాప్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలు

8 Feb, 2020 08:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆటో ఎక్స్‌పో 2020లో  దేశ, విదేశాల కార్లు సందడి  చేస్తున్నాయి.  ముఖ్యంగా దేశంలో త్వరలో అమల్లోకి రానున్న బీఎస్‌-6   నిబంధనల నేపథ్యంలో బీఎస్‌-6 ఆధారిత బైక్‌లు,  ఎలక్ట్రిక్‌ కార్లపై ఆయా కంపెనీలు ఎక్కువగా దృష్టి పెట్టాయి.  

టాటా మోటార్స్,  మహీంద్రా వంటి స్వదేశీ వాహన తయారీదారుల  నుంచి మొదలు గ్లోబల్ బ్రాండ్లు రెనాల్ట్ ,  కియా మోటార్స్ వరకు, అనేక మంది తయారీదారులు తమ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శించాయి. కొత్త లాంచింగ్‌ దగ్గర నుంచి తొలిసారి ప్రదర్శన వరకు, 2020 ఆటో ఎక్స్‌పోలో  ఎలక్ట్రిక్ వాహనాల సందడే సందడి. ఈ సందర్భంగా ఇప్పటివరకు ప్రదర్శించిన  ఈ వాహనాల్లో ప్రముఖంగా నిలిచిన అయిదుకార్లపై ఓ లుక్కేద్దాం.

టాటా ఆల్ట్రోజ్ ఈవీ ( ఎలక్ట్రిక్‌ వాహనం) 
2019 జెనీవా మోటార్ షోలో తొలిసారిగా ప్రపంచానికి ఆవిష్కరించిన టాటా ఆల్ట్రోజ్ ఈవీ ఎట్టకేలకు ఈ ఏడాది ఆటో ఎక్స్‌పోలో భారత్‌లోకి అడుగుపెట్టింది. టైగర్ ఇ.వి . నెక్సాన్ ఈవీ, ఆల్ట్రోజ్ ఈవీ తరువాత ఇది మూడవ ఎలక్ట్రిక్ కారు.అంతేకాదు భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కానుంది. ఈ ఏడాది చివర్లో లాంచ్ కానున్న టాటా ఆల్ట్రోజ్  ఈవీ .. జిప్‌ట్రాన్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ టెక్నాలజీతో రానుంది, అంటే ఈ కారు ఒక ఛార్జీతో 250 కిలోమీటర్లు దూసుకుపోతుంది.  ఫీచర్లపై పూర్తి స్పష్టత  రావాల్సి వుంది.


రెనాల్ట్‌ సీటీ కే-జెడ్‌ఈ
ఈ సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో రెనాల్ట్  ఆవిష్కరించిన కారు. సిటీ కె-జెడ్‌ఈ . ఇది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన  క్విడ్ కారు ఎలక్ట్రిక్ వెర్షన్ . చైనాలో జరిగిన 2019 షాంఘై మోటార్ షోలో మొదటిసారి ప్రదర్శించిన  ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కే-జెడ్‌ఈ కాన్సెప్ట్‌పై  రూపొందించి, రెనాల్ట్‌కు  చెందిన  అతిచిన్న ఈవీ అనిచెప్పవచ్చు.  క్విడ్ మాదిరిగా, రెనాల్ట్ సిటీ  కే-జెడ్‌ఈ కూడా సీఎంఎఫ్‌ ప్లాట్‌ఫాం ఆధారితమే. అయితే ఎలక్ట్రిక్ మోడల్ ప్రస్తుతం చైనాలో మాత్రమే అమ్ముడవుతోంది. 


మహీంద్రా ఇకేయూవి 100
మహీంద్ర నుంచి అనూహ్యంగా  దూసుకొచ్చిన  వాహనం ఈకేయూవి 100ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ప్రీ-ప్రొడక్షన్ మోడల్‌ను 2018 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది కంపెనీ. అయితే  కంపెనీ దీనిని విడుదల చేసింది, దీని ధర  రూ. 8.25 లక్షలు (ఎక్స్-షోరూమ్), ఇది భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ వాహనంగా నిలిచింది. కొత్త స్టైలింగ్‌తో,  కొత్త గ్రిల్ బ్లూ ఎలిమెంట్స్‌తో విడుదలైంది.

ఎంజీ మార్వెల్  ఎక్స్‌
ఇది  చైనాలోని  సాయిక్‌ గ్రూప్ బ్రాండ్ క్రింద విక్రయించే పూర్తి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.  దీనిని మోరిస్ గ్యారేజ్ ఇండియా  ఇండియాకు  తీసుకువచ్చింది. 2017 షాంఘై ఆటో షోలో ప్రదర్శించిన విజన్ ఇ కాన్సెప్ట్ ఆధారంగా  మార్వెల్ ఎక్స్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు,  ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లతో పాటు  హెవీ క్రోమ్ ఎలిమెంట్స్‌ను జోడించుకుని  ఎగ్రెసివ్‌ లుక్‌లో విడుదలైంది.  సిల్వర్ స్కిడ్ ప్లేట్‌,  స్పోర్టి అల్లాయ్ వీల్స్, ,వెనుక ఎల్‌ఈడీ టైలాంప్స్‌తో వస్తుంది.


కియా సోల్ ఈవీ
ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీతో  కియా మోటార్స్  తీసుకొచ్చిన వాహనం కియా సోల్ వీవీ. ప్రస్తుతం, దక్షిణ కొరియా మరియు ఇతర గ్లోబల్ మార్కెట్లలో అమ్మకానికి ఉన్న కియా సోల్ లిక్విడ్-కూల్డ్ లిథియం-అయాన్ పాలిమర్ 64 కిలోవాట్ల బ్యాటరీతో 450 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.. 2025 నాటికి భారతదేశంలో 16 ఎలక్ట్రిక్ వాహనాలను అందించాలని యోచిస్తున్నట్లు కియా ఇంతకుముందే ప్రకటించింది. ఇందులో భాగమే సోల్ ఈవీ. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, క్వాడ్-ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడి డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఇడి ఫాగ్ లాంప్స్ ,  ఎల్‌ఇడి టైల్‌ లాంప్‌లతో పాటు, హాట్‌ అండ్‌ వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ స్టార్ట్-స్టాప్ స్విచ్   ప్రధాన ఫీచర్లు.   

 చదవండి : మారుతి విటారా బ్రెజ్జా సరికొత్తగా అదరగొడుతున్న పియాజియో స్కూటీలు

మరిన్ని వార్తలు