వాహన విక్రయాలపై నోట్ల రద్దు ఎఫెక్ట్

12 Dec, 2016 14:33 IST|Sakshi
వాహన విక్రయాలపై నోట్ల రద్దు ఎఫెక్ట్

స్వల్పంగా పెరిగిన ప్యాసెంజర్ వాహన అమ్మకాలు
ఫిబ్రవరి నుంచి చూస్తే ఇదే కనిష్ట వృద్ధి
సియామ్ గణాంకాలు

న్యూఢిల్లీ: ప్యాసెంజర్ వాహన విక్రయాలకు కరెన్సీ నోట్ల రద్దు సెగ తగిలింది. ఇవి నవంబర్ నెలలో స్వల్పంగా పెరిగి, 1.82 శాతం వృద్ధితో 2,40,979 యూనిట్లకు ఎగశారుు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థారుు వృద్ధి. గతేడాది ఇదే నెలలో ప్యాసెంజర్ వాహన అమ్మకాలు 2,36,664 యూని ట్లుగా నమోదయ్యారుు. ఇక టూవీలర్ విక్రయాలు దాదాపు 6% క్షీణించారుు. సియామ్ తాజా గణాంకాల ప్రకారం..

దేశీ కార్ల విక్రయాలు 1,73,111 యూనిట్ల నుంచి 1,73,606 యూనిట్లకు పెరిగారుు. వాణిజ్య వాహన అమ్మకాలు 12 శాతం క్షీణతతో 45,773 యూనిట్లకు తగ్గారుు. ఇక మొత్తం వాహన విక్రయాలు 5.48 శాతం క్షీణతతో 16,54,407 యూనిట్ల నుంచి 15,63,665 యూనిట్లకు పడ్డారుు. గత 43 నెలల నుంచి చూస్తే ఈ స్థారుులో అమ్మకాలు తగ్గడం ఇదే తొలిసారి. చివరగా 2013 మార్చిలో మొత్తం వాహన విక్రయాల్లో 8 శాతం క్షీణత నమోదరుు్యంది.

మారుతీ సుజుకీ కార్ల విక్రయాలు 8 శాతం వృద్ధితో 89,479 యూనిట్ల నుంచి 96,767 యూనిట్లకు పెరిగారుు.

హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీ కార్ల అమ్మకాలు 13 శాతం క్షీణతతో 37,771 యూనిట్ల నుంచి 32,923 యూనిట్లకు తగ్గారుు.

మహీంద్రా యుటిలిటీ వాహన విక్రయాలు 34 శాతం క్షీణతతో 12,410 యూనిట్లకు పడ్డారుు.

మొత్తం టూవీలర్ అమ్మకాలు 6 శాతం తగ్గుదలతో 13,20,552 యూనిట్ల నుంచి 12,43,251 యూనిట్లకు క్షీణించారుు.

మోటార్‌సైకిల్ విక్రయాలు 10 శాతం క్షీణతతో 8,66,696 యూనిట్ల నుంచి 7,78,178 యూనిట్లకు పడ్డారుు. హీరో మోటోకార్ప్ విక్రయాలు 12 శాతంమేర, బజాజ్ అమ్మకాలు 8 శాతం మేర, హోండా విక్రయాలు 7% మేర క్షీణించారుు.

స్కూటర్ అమ్మకాలు 2 శాతం క్షీణతతో 3,96,024 యూనిట్ల నుంచి 3,88,692 యూనిట్లకు తగ్గారుు. హోండా విక్రయాలు 2 శాతంమేర, హీరో అమ్మకాలు 19 శాతంమేర, టీవీఎస్ విక్రయాలు 3 శాతంమేర క్షీణించారుు.

>
మరిన్ని వార్తలు