అటో మొబైల్‌ అమ్మకాలో రెండంకెల క్షీణత: క్రిసిల్‌ రిసెర్చ్‌

29 May, 2020 12:33 IST|Sakshi

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ పొడగింపుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అటోమొబైల్ పరిశ్రమ రెండంకెల అమ్మకాల క్షీణతకు దారితీస్తుందని క్రిసిల్ రీసెర్చ్ శుక్రవారం తన నివేదికలో పేర్కోంది. పాసింజర్‌, కమర్షియల్‌ వాహన అమ్మకాలు 2010 ఆర్థిక సంవత్సర స్థాయికి దిగిరావడంతో మొత్తం అమ్మకాల పరిమాణం కొన్నేళ్ల కనిష్టాన్ని పడిపోయే అకాశం ఉందని రీసెర్చ్‌ సంస్థ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య వాహన అమ్మకాలు 26-28శాతం, పాసింజన్‌ వాహనాల విక్రయాలు 24-26శాతం క్షీణించే అవకాశం ఉందని క్రిసిల్  అంచనా వేసింది. అయితే ట్రాక్టర్‌ అమ్మకాలు క్షీణత మాత్రం స్వల్పంగా 7-9శాతంగా మాత్రమే ఉండొచ్చని క్రిసిల్ సంస్థ చెప్పుకొచ్చింది. 

లాక్‌డౌన్‌ విధింపు, పొడగింపులతో పట్టణ ఆదాయలు భారీ క్షీణించాయని క్రిసెల్‌ రీసెర్చ్‌ పర్సన్‌ హతల్‌ గాంధీ అభిప్రాయపడ్డారు. మొత్తం 26వేల కంపెనీలకు రూ.7లక్షల కోట్ల ఉద్యోగ వ్యయాలున్నట్లు మేము నిర్థారించామని, దీంతో అటో పరిశ్రమలో ఉద్యోగ నష్టాలు లేదా వేతన కోతలకు మరింత ఆస్కారం ఉందని అభిప్రాయపడ్డారు. సప్లై నుంచి మొదలైన కష్టాలు అతి తొందర్లో డిమాండ్‌కు వైపు విస్తరిస్తుందని క్రిసిల్ అంచనా వేసింది. ఉద్యోగ భయాలు, వేతనాల కోతతో వినియోగదారుల కొనుగోళ్ల సెంటిమెంట్‌ తగ్గిందని రీసెర్చ్‌ సంస్థ అభిప్రాయపడింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసికంలో పండుగ సీజన్‌ సందర్భంగా డిమాండ్‌ కొంత రివకరీ అయ్యే అవకాశం ఉందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ద్వి-చక్ర వాహనాలకు అమ్మకాలు పెరగచ్చని పెరగవచ్చని క్రిసిల్ తెలిపింది. రబీ ఉత్పత్తులు పెరగచ్చనే అవుట్‌లుక్‌తో పాటు సాధారణ స్థాయిలో వర్షపాతం నమోదు కావచ్చనే అంచనాలతో ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ట్రాక్టర్లకు డిమాండ్‌ పెరగవచ్చని క్రిసిల్ అంచనా వేసింది. అయితే పాసింజర్‌, కమర్షియల్‌ వాహన విక్రయాలు నాలుగో త్రైమాసికంలో పెరగవచ్చని క్రిసిల్ తెలిపింది.  

మరిన్ని వార్తలు