పెట్రోల్, డీజిల్‌ కంటే విమాన ఇంధనమే చౌక!

2 Jan, 2019 01:08 IST|Sakshi

భారీగా తగ్గిన రేట్లు 

న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) ధరను కిలోలీటర్‌కు రూ.9,990 (14.7 శాతం) తగ్గిస్తూ ప్రభుత్వరంగ చమురు సంస్థలు నిర్ణయాన్ని ప్రకటించాయి. దీంతో ఢిల్లీలో కిలోలీటర్‌ ఏటీఎఫ్‌ ధర రూ.58,060కు దిగొచ్చింది. అంటే లీటర్‌ ధర రూ.58.06. ఢిల్లీ మార్కెట్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.68.65తో పోలిస్తే తక్కువకు అందుబాటులోకి వచ్చింది. లీటర్‌ డీజిల్‌ ధర రూ.62.66 కంటే కూడా చౌకగా మారింది. ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు ఇది పెద్ద ఎత్తున ఊరటనిచ్చే నిర్ణయం. డిసెంబర్‌లోనూ ఓ సారి పెద్ద మొత్తంలో రేట్లకు కోత విధించిన విషయం తెలిసిందే. దీంతో ఏటీఎఫ్‌ ధరలు ఏడాది కాలంలోనే కనిష్ట స్థాయికి చేరాయి.    

మరిన్ని వార్తలు