-

అదానీ చేతికి రిలయన్స్‌ ఎనర్జీ 

30 Aug, 2018 01:36 IST|Sakshi

రూ.18,800 కోట్ల డీల్‌ పూర్తి 

ముంబై: అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రా ముంబైలోని విద్యుత్‌ డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారాన్ని విక్రయించటం పూర్తయింది. ముంబై నగర విద్యుత్‌ సరఫరా వ్యాపారాన్ని (రిలయన్స్‌ ఎనర్జీ కపెనీని) రూ.18,800 కోట్లకు అదానీ ట్రాన్స్‌మిషన్‌కు విక్రయించడం పూర్తయిందని కంపెనీ చైర్మన్‌ అనిల్‌ అంబానీ తెలియజేశారు. ఈ విక్రయంతో మూడింట రెండొంతుల రుణ భారం తగ్గిందన్నారు. ఇంతకు ముందు రూ.22,000 కోట్లుగా ఉన్న కంపెనీ రుణ భారం ఇప్పుడు రూ.7,500 కోట్లకు తగ్గిందని తెలియజేశారు. వచ్చే ఏడాది కల్లా ఎలాంటి రుణభారం లేని కంపెనీగా అవతరించాలనేది తమ లక్ష్యమని పేర్కొన్నారు.  

రూ.133 కోట్ల ఎన్‌సీడీలకు చెల్లింపులు... 
రిలయన్స్‌ ఇన్‌ఫ్రారూ.133 కోట్ల ఎన్‌సీడీల చెల్లింపుల్లో విఫలమైంది. అయితే అదానీకి ముంబై విద్యుత్‌ వ్యాపార విక్రయం వల్ల వచ్చిన డబ్బులతో మరికొన్ని రోజుల్లో ఈ చెల్లింపులు జరుపుతామని అనిల్‌ అంబానీ తెలిపారు. బాంద్రా వెర్సోవా సీలింక్‌ ప్రాజెక్ట్‌ పనులు అక్టోబర్‌ 1 నుంచి ఆరంభమవుతాయన్నారు. 10 కిమీ ఈ ప్రాజెక్ట్‌ను ఇటలీకి చెందిన ఆస్టాల్డి కంపెనీ భాగస్వామ్యంతో నిర్మిస్తున్నామని, ఈ ప్రాజెక్ట్‌ వ్యయం రూ.6,994 కోట్లని తెలిపారు.

మరిన్ని వార్తలు