యాక్సిస్‌ బ్యాంకు లాభాలు రెట్టింపు

30 Jul, 2019 20:50 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశంలోని మూడవ అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు యాక్సిస్‌బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) తొలి త్రైమాసికంలో మెరుగైన లాభాలను సాధించింది.   నికర వడ్డీ ఆదాయం పెరగడంతో 2019 జూన్ 30 తో ముగిసిన మొదటి త్రైమాసికంలో (క్యూ1)లో  దాదాపు రెట్టింపు లాభాలను సాధించింది.  అయితే అధిక ప్రొవిజన్లు,  స్లిప్పేజీల కారణంగా మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది.

మార్కెట్లు ముగిశాక  ప్రకటించిన ఫలితాల్లో ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్)లో యాక్సిస్‌ బ్యాంక్‌ రూ. 1370 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 701 కోట్ల రూపాయలతో పోలిస్తే  ఇది 95 శాతం అధికం. నికర వడ్డీ ఆదాయం 13 శాతం పెరిగి రూ. 5844 కోట్లను తాకింది. త్రైమాసిక ప్రాతిపదికన ప్రొవిజన్లు రూ. 2711 కోట్ల నుంచి రూ. 3815 కోట్లను పెరిగాయి. అయితే స్థూల మొండిబకాయిలు (ఎన్‌పీఏలు) 5.26 శాతం నుంచి 5.25 శాతానికి నీరసించాయి. నికర ఎన్‌పీఏలు సైతం 2.06 శాతం నుంచి 2.04 శాతానికి తగ్గాయి.  స్థూల స్లిప్పేజెస్‌ రూ. 4798 కోట్లుగా నమోదయ్యాయి.   మంగళవారం యాక్సిస్ బ్యాంక్ షేర్లు 1.82 శాతం క్షీణించి 706.55 రూపాయల వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు