కస‍్టమర్లకు షాకిచ్చిన యాక్సిస్‌ బ్యాంక్‌

18 Jan, 2018 10:21 IST|Sakshi

సాక్షి, ముంబై:  ప్రైవేట్‌ బ్యాంక్‌ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌  షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. మార్జిన్ల బెడదతో  ఇబ్బందులు పడుతున్న బ్యాంకు  రుణాలపై వడ్డీరేటును పెంచేందుకు నిర్ణయించింది. రుణాలపై వసూలు చేసే లెండింగ్‌ రేటుపై 5 బేసిస్ పాయింట్లను పెంచుతూ  నిర్ణయం తీసుకుంది.  ఈ పెంపు జనవరి 18నుంచి అమల్లోకి రానుందని వెల్లడించింది.  దీంతో  బ్యాంకు అందిస్తున్న వార్షిక ఎంసీఎల్ఆర్  8.30 శాతానికి చేరింది.

వార్షిక రుణాలపై 5 బేసిస్ పాయింట్లు పెంచామనీ,  జనవరి 18 నుంచి అమల్లోకి వస్తోందని స్టాక్‌ ఎక్స్చేంజ్‌ ఫైలింగ్‌లో బ్యాంకు తెలిపింది.  అయితే లాకింగ్‌ పీరియడ్‌లో పాత రుణగ్రహీతలకు పాత వడ్డీరేట్లు వర్తిస్తాయని తెలిపింది.  ఈ నిర్ణయం  ప్రభావం కొత్తగా రుణాలను తీసుకునేవారిపై  పడనుంది.  మరోవైపు వడ్డీరేటును  పెంచుతున్న మొట్టమొదటి వాణిజ్య బ్యాంకుగా యాక్సిస్ బ్యాంక్  నిలిచింది.  దీంతో మూడు సంవత్సరాలలో మొదటిసారి వడ్డీ రేటు పెంచడం కొన్ని కీలక సంకేతాలను అందిస్తోందని విశ్లేషకులు పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు