యస్‌ సంక్షోభం : పెట్టుబడుల వెల్లువ

13 Mar, 2020 18:19 IST|Sakshi

యాక్సిస్‌ బ్యాంకు రూ. 600 కోట్ల పెట్టుబడులు 

హెచ్‌డీఎఫ్‌సీ రూ . 1000 కోట్లు

కోటక్ మహీంద్రా బ్యాంక్   రూ. 500 కోట్లు

సాక్షి, ముంబై : యస్‌ బ్యాంకులో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో పునర్నిర్మాణ  చర్యల్ని ఆర్‌బీఐ, కేంద్రం వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఆర్‌బీఐ ప్రతిపాదించిన బ్యాంకు రికన్‌స్ట్రక్షన్‌ స్కీమునకు  కేంద్ర క్యాబినెట్‌ శుక్రవారం ఆమోదం తెలిపింది. యస్‌ బ్యాంకు షేరు రూ.10 చొప్పున 725 కోట్ల కొనుగోలు ద్వారా రూ. 7,250 కోట్ల పెట్టుబడులకు ఎస్‌బీఐ నిర్ణయించింది. అలాగే ప్రైవేటుబ్యాంకు దిగ్గజం ఐసీఐసీఐ  కూడా రూ. 1,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. 100 కోట్ల ఈక్విటీ షేర్లను షేరుకు  రూ. 10 చొప్పున కొనుగోలు చేయనుంది.   ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐపెట్టబడుల ప్రకటన తరువాత వరుసగా ప్రైవేటు   బ్యాంకులు యస్‌బ్యాంకు వాటాల కొనుగోలుకు క్యూ కట్టాయి. ఐసీఐసీఐ, యాక్సిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ ,కోటక్‌ మహీంద్ర   బ్యాంకు బోర్డులు ఈపెట్టుబడులకు ఆమోదం తెలిపాయి.

 ప్రైవేటుబ్యాంకు యాక్సిస్‌ బ్యాంకు కూడా రూ. 600 కోట్లు  పెట్టుబడికి అంగకీరించింది.  ఐసీఐసీఐ తరువాత, యాక్సిస్ బ్యాంక్ ఈ పెట్టుబడులను ప్రకటించింది. శుక్రవారం జరిగిన యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో  60 కోట్ల వరకు ఈక్విటీ షేర్ల కొనుగోలుకు రూ. 600 కోట్ల (రూ.ఆరు వందల కోట్లు మాత్రమే) పెట్టుబడి పెట్టడానికి అనుమతి ఇచ్చిందని బ్యాంకు తెలిపింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 ప్రకారం యస్‌ బ్యాంక్ పునర్నిర్మాణం ప్రతిపాదిత ప్రణాళికలోఈక్విటీ షేరుకు రూ .2 (రూ.8 ప్రీమియంతో)కు కొనుగోలు చేయనున్నామని యాక్సిస్ బ్యాంక్ ఎక్స్ఛేంజీలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ కూడా వెయ్యికోట్ల రూపాయల పెట్టుడిని యస్‌బ్యాంకుకు సమకూర్చనుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ రూ .10 చొప్పున 50 కోట్ల యస్‌ బ్యాంక్  షేర్లను కొనుగోలు చేయనుంది. తద్వారా రూ.500 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. (రాణా, ఆయన భార్యకు సీబీఐ మరో షాక్‌)

 చదవండి :  ‘యస్‌’ పునర్నిర్మాణ పథకం, త్వరలోనే ఆంక్షలు ఎత్తివేత

మరిన్ని వార్తలు