మూడో సంవత్సరంలోనూ ప్రేమ్‌జీయే

9 Jan, 2016 00:50 IST|Sakshi
మూడో సంవత్సరంలోనూ ప్రేమ్‌జీయే

* అత్యంత దాతృత్వమున్న భారతీయుడిగా ఘనత
* హురుణ్ ఇండియా దాతృత్వ జాబితా

న్యూఢిల్లీ: విప్రో ప్రేమ్‌జీ మూడో ఏడాది  2015లో కూడా అత్యంత దాతృత్వం ఉన్న భారతీయుడిగా నిలిచారు. హురుణ్ ఇండియా దాతృత్వ జాబితా ప్రకారం విద్యా కార్యక్రమాల కోసం రూ.27,514 కోట్లు విరాళాలిచ్చిన అజిమ్ ప్రేమ్‌జీ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన తర్వాతి స్థానాల్లో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని, నా రాయణ మూర్తిలు రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు. అజిమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ఎనిమిది రాష్ట్రాల్లో మూడున్నర లక్షలకు పైగా పాఠశాలల్లో విద్యాసాధికారత కోసం కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

రూ.2,404 కోట్ల విరాళమిచ్చిన నందన్, రో హిణి నిలేకని కుటుంబం రెండో స్థానంలో నిలిచింది. ఎంటర్‌ప్రెన్యూర్షిప్, సామాజిక అభివృద్ధి, విద్యాకార్యక్రమాల కోసం రూ.1,322 కోట్లు విరాళాలిచ్చిన నారాయణ మూర్తి, ఆయన కుటుంబం మూడో స్థానంలో ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ముకేశ్ అంబానీ రూ.345 కోట్లు విరాళాలిచ్చి ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచారు.

>
మరిన్ని వార్తలు