జీఎస్‌టీ ఎఫెక్ట్‌: క్షీణించిన బజాజ్‌ ఆటో మార్జిన్లు

20 Jul, 2017 13:52 IST|Sakshi

ముం‍బై: జీఎస్‌టీ ఎఫెక్ట్‌ దేశీయ ఆటో రంగ దిగ్గజం బజాజ్‌ ఆటో  లిమిటెడ్ ను తాకింది.  ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నికరలాభంలో బాగా నీరసించింది.  క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)ఈ  ఫలితాల్లో   కంపెనీ నికర లాభం 6 శాతం క్షీణించింది.   గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే 5.6 శాతం తగ్గి రూ. 924 కోట్లను  సాధించింది. ఆదాయం 4 శాతం క్షీణించి రూ. 5,854 కోట్లకు చేరింది. అయితే నికర లాభం, రూ. 907.7 కోట్లుగాను, ఆదాయం రూ. 5,499 కోట్లగాను అంచనాలవేసిన విశ్లేషకులను అధిగమించింది.
 నిర్వహణ లాభ(ఇబిటా) మార్జిన్లు 17.2 శాతంగా నమోదయ్యాయి. వడ్డీ, పన్ను, తరుగుదల, రుణ విమోచన అనంతర లాభాలు 20.2 శాతం తగ్గి 938.24 కోట్లకు చేరుకున్నాయి. అదే సమయంలో మార్జిన్లు  20.2 శాతం నుంచి  17.2 శాతానికి తగ్గాయి. భారత్ స్టేజ్ -4 ఉద్గార నిబంధనల మార్పు, జూలై 1 న అమల్లోకి  గూడ్స్ అండ్ సర్వీసెస్   టాక్స్‌ బదిలీ  కంపెనీ పనితీరు ప్రభావితం చేసిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌ లోకంపెనీ ప్రకటించింది.

బీఎస్‌-3 వాహనాల రద్దు, బీఎస్‌-4  నిబంధనలకు మారడం,  జీఎస్‌టీ  పరిధిలో కొత్త పన్నులు తదితర అంశాలు బజాజ్‌  ఫలితాలను ప్రభావితం చేశాయని ఎనలిస్టులు భావిస్తున్నారు.  దీంతో అమ్మకాలు క్షీణించాయని పేర్కొన్నారు.  జీఎస్‌టీ   అమలు నేపథ్యంలో డీలర్స్‌కు 320 మిలియన్ల  రూపాయలను  చెల్లించినట్టు  బజాజ్‌ ఆటో తెలిపింది.
 వాల్యూమ్లు  10.7 శాతం క్షీణించి  ఎనిమిదేళ్ల గరిష్టాన్ని నమోదు చేసింది.   2009 మార్చి  ​క్వార్టర్‌కు చేరాయని  ఈక్విటీ ఎనలిస్టు అశ్విన్‌ పటేల్‌ చెప్పారు. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో బజాజ్‌ ఆటో షేరు స్వల్పంగా నష్టపోతోంది.
 

మరిన్ని వార్తలు