బజాజ్‌ ఆటో లాభం రూ.1,523 కోట్లు

24 Oct, 2019 05:08 IST|Sakshi

21 శాతం వృద్ధి 

4 శాతం తగ్గిన మొత్తం ఆదాయం 

అమ్మకాలు 12 శాతం డౌన్‌

న్యూఢిల్లీ: బజాజ్‌ ఆటో కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.1,523 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆరి్థక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం (రూ.1,257 కోట్లు)తో పోలి్చతే 21 శాతం వృద్ధి సాధించామని బజాజ్‌ ఆటో తెలిపింది. కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు ప్రయోజనం కారణంగా రూ.182 కోట్ల పన్ను ఆదా కావడం  కలసి వచ్చిందని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.8,036 కోట్ల నుంచి 4 శాతం తగ్గి రూ.7,707 కోట్లకు చేరిందని పేర్కొంది.

పన్నులు, డివిడెండ్లు కలిసి మొత్తం రూ.2,072 కోట్ల చెల్లింపులు పోను ఈ ఏడాది సెపె్టంబర్‌ 30 నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.15,986 కోట్లుగా ఉన్నాయని తెలిపింది.  కాగా, గత క్యూ2లో 13.4 లక్షలుగా ఉన్న మొత్తం వాహన విక్రయాలు ఈ క్యూ2లో 11.73 లక్షలకు తగ్గాయని బజాజ్‌ ఆటో తెలిపింది. మోటార్‌ బైక్‌ల విక్రయాలు 11.26 లక్షల నుంచి 12 శాతం తగ్గి 9.84 లక్షలకు తగ్గాయని పేర్కొంది.

>
మరిన్ని వార్తలు