చేతక్‌ మళ్లీ వచ్చేసింది!!

17 Oct, 2019 04:02 IST|Sakshi
చేతక్‌ ఈ–స్కూటర్‌ను ఆవిష్కరిస్తున్న రవాణా శాఖ మంత్రి గడ్కరీ, రాజీవ్‌ బజాజ్‌

ఈసారి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ రూపంలో రూ. 1.50 లక్షల లోపు ధర

జనవరి నుంచి అమ్మకాలు...

న్యూఢిల్లీ: దేశీ ద్విచక్ర వాహన రంగంలో ఒకప్పుడు రారాజుగా వెలిగి, కనుమరుగైన బజాజ్‌ చేతక్‌ స్కూటర్‌ ఈసారి ఎలక్ట్రిక్‌ వాహనంగా తిరిగొస్తోంది. బజాజ్‌ ఆటో బుధవారం చేతక్‌ ఈ–స్కూటర్‌ను ఆవిష్కరించింది. కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ దీన్ని ఆవిష్కరించారు. అమ్మకాలు జనవరి నుంచి మొదలవుతాయని బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ తెలిపారు. ముందుగా పుణెలో ఆ తర్వాత బెంగళూరులో విక్రయాలు ప్రారంభిస్తామని, స్పందనను బట్టి మిగతా ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. భవిష్యత్‌లో ఉండే అవకాశాలను గుర్తించే.. ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్లో ముందుగా కాలు మోపుతున్నామని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్‌ అంతా ఎలక్ట్రిక్‌ వాహనాలు, బయో ఇంధనాలు వంటి పర్యావరణ అనుకూల టెక్నాలజీలదేనని గడ్కరీ తెలిపారు. నీతి అయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

95 కి.మీ. దాకా మైలేజీ..
అధికారికంగా చేతక్‌ ఈ–స్కూటర్‌ రేటు ఎంతన్నది వెల్లడించనప్పటికీ, రూ. 1.5 లక్షల లోపే ఉంటుందని కంపెనీ వెల్లడించింది. దీన్ని ఒక్కసారి 5 గంటల పాటు చార్జింగ్‌ చేస్తే.. ఎకానమీ మోడ్‌లో 95 కి.మీ., స్పోర్ట్స్‌ మోడ్‌లో 85 కి.మీ. మైలేజీ ఇస్తుందని పేర్కొంది. తమ ప్రొ–బైకింగ్‌ డీలర్‌షిప్స్‌ ద్వారా వీటిని విక్రయించనున్నట్లు రాజీవ్‌ బజాజ్‌ చెప్పారు. మహారాష్ట్రలోని చకన్‌ ప్లాంటులో తయారు చేసే చేతక్‌ ఈ–స్కూటర్స్‌ను వచ్చే ఏడాది నుంచి యూరప్‌లోని వివిధ దేశాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు.

హమారా బజాజ్‌...: 1970ల తొలినాళ్లలో ప్రవేశపెట్టిన చేతక్‌ స్కూటర్‌ దేశీ ద్విచక్ర వాహన రంగంలో ఓ సంచలనం సృష్టించింది.  మహాయోధుడు రాణా ప్రతాప్‌ సింగ్‌కి చెందిన వేగవంతమైన అశ్వం ’చేతక్‌’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ స్కూటర్లు.. అప్పట్లోనే కోటి పైగా అమ్ముడయ్యాయి. బుక్‌ చేసుకుంటే ఏళ్ల తరబడి వెయిటింగ్‌ లిస్టు ఉండేది. 2005 ప్రాంతంలో స్కూటర్స్‌ తయారీని బజాజ్‌ నిలిపివేసి పూర్తిగా మోటార్‌సైకిల్స్‌పై దృష్టిపెట్టింది.

ఎలక్ట్రిక్‌ టూ వీలర్స్‌కు సబ్సిడీ..
ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్, హైబ్రిడ్‌ వెహికిల్స్‌ (ఫేమ్‌) పథకం కింద ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుపై కస్టమర్లు సబ్సిడీ అందుకోవచ్చు. ద్విచక్ర వాహనాలకు అంతకు ముందు మోటార్‌నుబట్టి ఈ సబ్సిడీ నిర్ణయించేవారు. ప్రస్తుతం టెక్నాలజీని బట్టి సబ్సిడీ ఇస్తున్నారు. ఒక కిలోవాట్‌ అవర్‌కు రూ.10,000 చొప్పున గరిష్టంగా రూ.30,000 వరకు సబ్సిడీ ఉందని అవేరా న్యూ అండ్‌ రెనివేబుల్‌ ఎనర్జీ మోటోకార్ప్‌ టెక్‌ ఫౌండర్‌ వెంకట రమణ తెలిపారు. ఉదాహరణకు 3 కిలోవాట్‌ అవర్‌ సామర్థ్యం గల వాహనం ఖరీదు రూ.80,000 ఉందనుకుందాం.

వినియోగదారు షోరూంలో రూ.50,000 చెల్లిస్తే చాలు. తయారీదారు ప్రతి 3 నెలలకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెవీ ఇండస్ట్రీకి వాహనాల అమ్మకాల వివరాలను అందజేయాల్సి ఉంటుంది. మోటారు వాహన చట్టం కింద నమోదయ్యే ఎలక్ట్రిక్‌ స్కూటర్లకే ఈ సబ్సిడీ లభిస్తుంది. ఇందుకోసం తయారీదారు స్కూటర్‌ విభాగంలో సంబంధిత ఎలక్ట్రిక్‌ వాహనానికి ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. గంటకు 25 కిలోమీటర్లపైగా వేగం, 250 వాట్స్‌ కంటే అధిక సామర్థ్యం ఉన్న మోటార్‌ ఉంటేనే స్కూటర్‌గా పరిగణిస్తారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డిజిటల్‌ లావాదేవీల్లో హైదరాబాద్‌ సెకండ్‌

అనుకోకుండా.. ఇన్వెస్ట్‌ చేశా!

అంతా వాళ్లే చేశారు..!

మరోసారి మోగనున్న బ్యాంకుల సమ్మె సైరన్‌

మెర్సిడెస్‌ బెంజ్‌  జీ-క్లాస్‌ లగ్జరీ కారు

సరికొత్తగా హమారా బజాజ్‌ స్కూటర్‌ చేతక్‌

ఊగిసలాట మధ్య వరుసగా నాలుగో రోజు లాభాలు

అమ్మకాల దెబ్బ : ఫ్లాట్‌గా మార్కెట్లు

షావోమి రెండు స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌

వారి హయాంలోనే బ్యాంకులు డీలా..

మొబైల్‌ చార్జీలకు రెక్కలు!

రూ. 2 వేల నోటు కనబడుటలేదు!!

విప్రో లాభం 35% జూమ్‌

భారత్‌లో తొలి 5జీ లైవ్‌ వీడియో కాల్‌

భారత వృద్ధిరేటు : ఐఎంఎఫ్ కోత 

రూ.2 వేల నోటు : ఓ షాకింగ్‌ న్యూస్‌

మార్కెట్లోకి మరో సూపర్‌ టీవీ వచ్చేసింది

అంచనాలు దాటేసిన విప్రో : 36 శాతం ఎగిసిన లాభం

వరుసగా మూడో సెషన్‌లోనూ లాభాలు

మార్కెట్లు 400 పాయింట్లు జంప్‌

5జీ సేవలను ప్రదర్శించిన జియో, శాంసంగ్‌

5 వేల డాలర్ల ప్రైజ్‌మనీ గెలిచారు!

9 రోజుల్లో రూ.81,700 కోట్ల రుణాలు

హెచ్‌యూఎల్‌ లాభం రూ.1,848 కోట్లు 

5జీ వేలం ఈ ఏడాదే..

మరో రెండు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్‌బీఐ

ఐదు స్టార్టప్‌లతో మారుతి జత

ఎయిర్‌టెల్ సెట్-టాప్ బాక్స్‌ల ధర తగ్గింపు

జియో దెబ్బ ‌: ఎగిసిన ఎయిర్‌టెల్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దేశభక్తిని రగిలించే చిత్రం ‘సైరా’

నేనీ స్థాయిలో ఉండటానికి కారణం నా తమ్ముళ్లే

ఏడాది చివర్లో పండగ

నవ్వుల కీర్తి

రేస్‌ మొదలు

ఈ కాంబినేషన్‌ కొత్తగా ఉంది