బజాజ్ కేటీఎం 390 డ్యూక్ @1.8 లక్షలు

26 Jun, 2013 16:50 IST|Sakshi
Duke

పుణే: బజాజ్ ఆటో మిడ్ సైజ్ స్పోర్ట్స్ బైక్... కేటీఎం 390 డ్యూక్‌ను మంగళవారం విడుదల చేసింది. ధరను రూ.1.8 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది. కేటీఎం ప్లాట్‌ఫామ్ మీద బజాజ్ ఆటో తెస్తోన్న రెండో బైక్ ఇది. గత ఏడాది జనవరిలో తొలి బైక్, కేటీఎం 200 డ్యూక్‌ను అందించింది. ఆరు గేర్లున్న ఈ బైక్ 22-25 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని అంచనా. గరిష్టంగా గంటకు 170 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ బైక్‌లో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్), మెట్‌జెలార్ టైర్లు, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, అల్యూమినియం 10 స్పోక్ అలాయ్ వీల్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. 100 కి.మీ. వేగాన్ని 7 సెకన్లలోనే అందుకోగలదు. ఇప్పటిదాకా 11,000 కేటీఎం 200 డ్యూక్ బైక్‌లను విక్రయించామని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ పేర్కొన్నారు.  కేటీఎం 390 డ్యూక్‌తో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త సెగ్మెంట్‌ను సృష్టించామని  చెప్పారు.
 

మరిన్ని వార్తలు