మార్కెట్‌లోకి కొత్త పల్సర్‌ బైక్‌‌

18 Jun, 2020 16:43 IST|Sakshi

ముంబై: పల్సర్ బైక్స్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా పల్సర్‌ 125 స్ప్లిట్ సీట్ వేరియంట్ పేరుతో గురువారం బజాజ్‌ ఆటో మార్కెట్లో రిలీజ్‌ చేసింది. ఈ బైక్‌ సింగిల్ సిట్‌ డ్రమ్‌ వేరియంట్‌ కలిగిన అత్యున్నత టెక్నాలజీతో రూపొందించామని సంస్థ తెలిపింది. ఈ బైక్‌లో కొన్ని అదనపు ఫీచర్లు వినిమోగదారులను ఆకర్శిస్తాయని సంస్థ పేర్కొంది. బైక్‌లో రెగ్యులర్‌ మోడల్‌ సింగిల్ యూనిట్‌కు బదులుగా స్పోర్టి బెల్లీ పాన్, స్పి‍ట్ గ్రాబ్ రైల్స్ వంటి కొన్ని అదనపు ఫీచర్లతో ఈ బైక్ అలరించనుంది. కాగా పల్సర్‌ 125 బైక్‌ కలర్‌ విషయానికి వస్తే బ్లాక్ సిల్వర్, బ్లాక్ రెడ్, నియాన్ గ్రీన్ కలర్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది.

అత్యాధునిక ఫీచర్లతో అలరించనున్న పల్సర్‌ 125 వేరియంట్‌ బైక్‌ ధర రూ.79,091గా సంస్థ నిర్ణయించింది. పల్సర్‌ 125 వేరియంట్‌ బైక్‌ను వినియోగదారులకు అందించడం పట్ల బజాజ్‌‌ ఆటో ప్రెసిడెంట్‌ సారంగ్‌ కనడే హర్షం వ్యక్తం చేశారు.  సారంగ్‌ కనడే స్పందిస్తూ.. గత సంవత్సరం విడుదల చేసిన పల్సర్‌ 125 బైక్‌ కేవలం ఆరు నెలల్లోనే లక్ష బైకులను కస్టమర్లు కొనుగోలు చేశారని అన్నారు. స్పోర్ట్స్‌ బైక్‌ను ఇష్టపడే వారికి సరికొత్త స్టైల్‌, థ్రిల్‌తో ఈ బైక్‌ అలరిస్తుందని తెలిపారు. 

చదవండి: బజాజ్‌ ఆటో కొత్త బైక్‌ : రూ.38 వేలు 

మరిన్ని వార్తలు