నందన్‌ నీలేకనిపై బాలకృష్ణన్‌ ప్రశంసలు

6 Jan, 2018 20:32 IST|Sakshi

సాక్షి, బెంగళూరు:  ఇన్ఫోసిస్‌ సీఈవో  సలీల్ పరేఖ్  వేతనంపై ఇన్ఫోసిస్ మాజీ  చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వి.బాలకృష్ణన్  ప్రశంసలు కురిపించారు. సరైన నిర్ణయం తీసుకున్నారంటూ ఇన్పీ  బోర్డు సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకనిని అభినందించారు. గత బోర్డు  చేసిన 'దుర్వినియోగాలను' సరిచేయడానికి, ప్రస్తుత సిఈఓకు సహేతుకమైన జీతాలను ఫిక్సి చేశారన్నారు. ముఖ్యంగా మాజీ సీఈవో విశాల్‌ సిక్కా కంటే తక్కువ వేతనం ప్రకటించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

గత నష్టాలను సరిచేయడానికి నందన్ సరియైన పని చేశారని, ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌  సాలరీ స్ట్రక్చర్‌ రీజనబుల్‌గా ఉందని శనివారం వ్యాఖ్యానించారు.  ఉన్నత వృద్ధిని పొందడం ద్వారా వాటాదారుల విలువను పెంచుకునేందుకు  స్పష్టంగా దృష్టి కేంద్రీకరించాలనీ,   బోర్డు ఏవైనా అభీష్టాలను వ్యక్తీకరించాలంటే సరైన వాదనతో వాటాదారులకు వివరించాలని ఆయన  సూచించారు.

కాగా ఇన్ఫీ కొత్త సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన  పరేఖ్ జీతం  2018-2019 ఆర్థిక సంవత్సరాంతానికి రూ. 65 మిలియన్లుగా నిర్ణయించారు. వేతనం కింద రూ.6.5 కోట్లు, దీనికి తోడు రూ.9.75 కోట్లను వేరియబుల్ చెల్లింపుల కింద పొందుతారని ఇన్పోసిస్ ప్రకటించింది.  మాజీ సీఈవో విశాల్‌ సిక్కా వేతనం కింద సుమారు రూ.43 కోట్లు పొందేవారు.


 

మరిన్ని వార్తలు