వడ్డీరేట్లను నిర్ణయించిన బంధన్ బ్యాంక్

17 Aug, 2015 23:32 IST|Sakshi
వడ్డీరేట్లను నిర్ణయించిన బంధన్ బ్యాంక్

కోల్‌కతా: త్వరలో కార్యకలాపాలు ప్రారంభించనున్న కొత్త బంధన్ బ్యాంక్- అకౌంట్ హోల్డర్ల కోసం పొదుపు, డిపాజిట్ రేట్లను నిర్ణయించింది. చైర్మన్ సీఎస్ ఘోష్ ఇక్కడ ఈ విషయాన్ని తెలిపారు. రూ. లక్షలోపు పొదుపుపై వడ్డీ రేటును 4.25 శాతంగా నిర్ణయించింది. రూ. లక్ష పైన ఈ రేటు 5 శాతంగా ఉంది. టర్మ్ డిపాజిట్ గరిష్ట రేటు (ఏడాది నుంచి మూడేళ్లకు) 8.5 శాతంగా ఉంది. సీనియర్ సిటిజన్ల విషయంలో ఈ రేటు అరశాతం అధికం. ఆగస్టు 23న కొత్త కోల్‌కతా కేంద్రంగా ఏర్పాటవుతున్న బ్యాంక్‌ను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రారంభించనున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ )డిప్యూటీ గవర్నర్ హెచ్‌ఆర్ ఖాన్ కూడా కార్యక్రమానికి హాజరవుతారు. ఇంతక్రితం మైక్రో ఫైనాన్స్ సంస్థగా ఉన్న బంధన్‌కు బ్యాంక్ ఏర్పాటుకు గత ఏడాది ఆగస్టులో ఆర్‌బీఐ నుంచి ఆమోదం లభించింది.

మరిన్ని వార్తలు