లిస్టింగ్‌లో అదరగొట్టిన బంధన్‌ బ్యాంక్‌

27 Mar, 2018 13:16 IST|Sakshi

సాక్షి,ముంబై:  కోలకతాకు చెందిన  ప్రయివేట్‌ రంగ సంస్థ బంధన్‌ బ్యాంక్‌  లిస్టింగ్‌లో అదరగొట్టింది.   డెబ్యూ లిస్టింగ్‌లో 33శాతం ప్రీమియం లాభాలతో లిస్ట్‌ అయింది. అయ్యింది.   ఇష్యూ ధర రూ. 375 కాగా.. బీఎస్ఈలో 499 వద్ద గరిష్టాన్ని  తాకింది. మార్చి 19న ముగిసిన ఇష్యూ బ్యాంక్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లాభాలతో లిస్టయ్యింది.  గత వారం దాదాపు 15 రెట్లు అధికంగా సబ్‌స్క్యయిబ్‌ అయింది.  రూ. 375 ధరలో చేపట్టిన  ఐపీవో ద్వారా బ్యాంకు రూ. 4,473 కోట్లు సమీకరించింది. ఇష్యూలో భాగంగా బ్యాంకు 8.35 కోట్ల షేర్లను అమ్మకానికి ఉంచగా.. దాదాపు 122 కోట్ల షేర్ల కోసం బిడ్స్‌ దాఖలైన సంగతి తెలిసిందే. ఇష్యూ ముందు రోజు యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి బంధన్‌ బ్యాంకు రూ. 1342 కోట్లను సమీకరించింది. షేరుకి రూ. 375 ధరలో 65 యాంకర్‌ సంస్థలకు దాదాపు 3.58 కోట్ల షేర్లను విక్రయించింది.

కాగా  బంధన్‌ బ్యాంకు ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌, అసోం, బీహార్‌ తదితర తూర్పు, ఈశాన్య రాష్టాలలో కార్యకాలాపాలు విస్తరించింది.   గత ఏడాది డిసెంబర్‌ 31 నాటికి మొత్తం 887 బ్రాంచీలలో 58 శాతం శాఖలను ఈ ప్రాంతాలలోనే ఏర్పాటు చేసింది. మొత్తం430 ఏటీఎంలను ఏర్పాటు చేసింది. మైక్రో ఫైనాన్సింగ్‌ బిజినెస్‌లో పట్టుసాధించిన సంస్థ తదుపరి సాధారణ బ్యాంకింగ్‌ సర్వీసులు అందించేందుకు లైసెన్సింగ్‌ను పొందింది.  దాదాపు 2.13 మిలియన్లకుపైగా ఖాతాదారులను కలిగి ఉంది.

మరిన్ని వార్తలు