బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ సంచలన నిర్ణయం

2 Nov, 2017 19:15 IST|Sakshi

లండన్‌: బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ సంచలన నిర్ణయం తీసుకుంది.  సుదీర్ఘ కాలం తరువాత బెంచ్‌మార్క్‌ వడ్డీరేట్లను స్వల్పంగా పెంచుతూ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది.  దాదాపు 10 ఏళ్ల తరువాత మొదటిసారిగా వడ్డీ రేట్లను  25 బేసిస్‌ పాయింట్లనుపెంచుతున్నట్టు  గురువారం ప్రకటించింది.    దీంతో 0.25నుంచి 0.50శాతానికి చేరింది. 

పాలసీ సమీక్ష చేపట్టిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ వడ్డీ రేటులో 2007 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తరువాత తొలిసారిగా వడ్డీరేట్లను 0.25 శాతం మేర పెంచడంతో మాణిక వడ్డీ రేటు 0.50 శాతానికి చేరింది.  అలాగే తదుపరి మూడు సంవత్సరాలలో  క్రమంగా స్వల్ప పెరుగుదల  ఉంటుందని  అంచనాలను వెల్లడించింది  ఈ స్వల్ప పెంపునకు , ద్రవ్య విధాన కమిటీ 7-2 ఓటుతో ఆమోదం తెలిపిందని బీఓఈ డిప్యూటీ గవర్న్‌ర్లు జాన్‌ కున్లిఫ్ఫ్ ,  డేవ్ రామ్స్‌డెన్‌ వెల్లడించారు.  మరోవైపు రేటు పెంపుపై  అక్కడి ఆర్థిక వేత్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ నిలకడగా  ఉన్న పరిస్థితుల్లో  విధానాలను మరింత పటిష్టం చేయడం అవసరమని బీఓఈ గవర్నర్‌ మార్క్‌కార్నే అభిప్రాయపడ్డారు. 

కాగా 2007 ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో బ్రిటన్‌ ఆర్థికవ్యవస్థ దశాబ్దాలుగా తీవ్ర మాంద్యంలో  చిక్కుకుంది.  అలాగు ఆగస్టు 2016 లో బ్రెగ్జిట్‌ అనంతరం అత్యవసర రేట్‌కట్‌ను ప్రకటించింది.  

మరిన్ని వార్తలు