నవంబరు నెలాఖరులో బ్యాంకు సెలవులు

21 Nov, 2018 17:50 IST|Sakshi

సాక్షి, ముంబై: నవంబరు నెలాఖరులో బ్యాంకులు నాలుగు రోజులు మూత పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారంలో వీలైనంత త్వరగా ముఖ్యమైన బ్యాంకు పనులు పూర్తి చేసుకోవాలని బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ అసోసియేషన్ వెల్లడించింది. అయితే తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో నవంబరులో దీపావళి, ఈద్‌ (నేడు) రెండే పండుగ సెలవులు.

అసోసియేషన​ కార్యదర్శి వికె శెంగర్ అందించిన సమాచారం ప్రకారం ఈద్-ఎ-మిలాద్ సందర్భంగా ఈ రోజు బ్యాంకులు కొన్ని రాష్ట్రాల్లో  పని చేయలేదు. నవంబరు 21 (ఈద్‌)న అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, గోవా, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, పంజాబ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లో బ్యాంకులకు సెలవు లేదు.

అలాగే గురునానక్‌ జయంతిని పురస్కరించుకొని నవంబరు 23న కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. అయితే తెలుగు రాష్ట్రాలు, బిహార్‌, డామన్‌ అండ్‌ డయ్యు, గోవా, కర్ణాటక, కేరళ, మణిపూర్‌, మేఘాలయ, ఒడిశా, పాండిచ్చేరి, సిక్కిం, తమిళనాడు, త్రిపుర మినహా మిగిలిన రాష్ట్రాల్లో బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయి.

24, నవంబర్ - నాలుగో శనివారం పంజాబ్‌లో మాత్రమే సెలవు
25, నవంబర్ - ఆదివారం
26, నవంబర్ - కనకదాస్ జయంతి సందర్భంగా కర్ణాటకలో మాత్రమే సెలవు.

అయితే సెలవు రోజుల్లో  ఏటీఎంలలో నగదుకు ఎలాంటి కొరత ఉండదని బ్యాంకులు స్పష్టం చేశాయి.

మరిన్ని వార్తలు