బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ కీలక నిర్ణయం

23 Jan, 2018 09:36 IST|Sakshi


బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల ద్రవ్య విధానం సమావేశం ముగిసిన అనంతరం మార్కెట్ అంచనాలను అనుగుణంగానే తన పాలసీ విధానాన్ని వెల్లడించింది. తమ వడ్డీ రేట్లను ఎలంటి మార్పులలేకుండా యధాతథంగా  ఉంచినట్టు సెంట్రల్ బ్యాంకు తెలిపింది

బ్యాంక్ ఆఫ్ జపాన్ మంగళవారం  మానిటరీపాలసీ విధానాన్ని ప్రకటించింది. రెండు రోజుల సమావేశం ముగిసిన తరువాత విడుదలైన ఒక ప్రకటనలో  డిపాజిట్‌ రేట్లను -0.1శాతం వద్ద 10 సంవత్సరాల   లక్ష్యాన్ని జీరో శాతంగాను  నిర్ణయించినట్టు  పేర్కొంది. ఈ నెలలోనే దీర్ఘకాల ప్రభుత్వ బాండ్ల కొనుగోళ్లను స్వల్పంగా తగ్గించింది.  కాగా ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణకు  ప్రపంచ కేంద్ర బ్యాంకుల అడుగుజాడలను అనుసరిస్తుందనే ఊహాగానాలొచ్చాయి. దీనికి అనుగుణంగానే  బీఓజే తన పాలసీ విధానాన్ని వెల్లడించింది. వినియోగదారుల ధర సూచిక  నవంబరులో సంవత్సరం ప్రాతిపదికన 0.9 శాతం పెరిగింది, వరుసగా 11 వ నెల పెరుగుదల నమోదయింది. కాగా మెట్రిక్ ఒక రాయిటర్స్ పోల్ ప్రకారం, డిసెంబర్ లో అదే స్థాయి పెరుగుతుందని అంచనా. డిసెంబర్ డేటా ఈ శుక్రవారం విడుదల కానుంది. అయితే ఆహార, ఇంధనం ధరలను మినహాయించిన వినియోగదారుల ధరలు నవంబర్లో కేవలం 0.3 శాతం పెరిగాయి.

మరిన్ని వార్తలు