డిపాజిట్ రేట్లు తగ్గించిన బీఓబీ

25 Apr, 2015 01:38 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) డిపాజిట్ రేట్లు తగ్గాయి. పలు మెచ్యూరిటీలకు సంబంధించి ఈ రేట్లను 0.15-0.40 శాతం శ్రేణిలో తగ్గించినట్లు బ్యాంక్ శుక్రవారం  తెలిపింది. ఏప్రిల్ 22 నుంచీ తాజా రేట్లు అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.
 త్వరలో బీఓఐ రుణ రేటు తగ్గింపు..: త్వరలో 10 నుంచి 25 బేసిస్ పాయింట్ల మేర బేస్‌రేటు (కనీస రుణ రేటు)ను తగ్గిస్తామని శుక్రవారం బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ విజయలక్ష్మీ అయ్యర్ ముంబైలో విలేకరులకు తెలిపారు.

రుణ రేట్లు తగ్గింపుకు సంకేతంగా పలు దిగ్గజ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఇప్పటికే డిపాజిట్ రేట్లలో కోత పెట్టాయి.

మరిన్ని వార్తలు