రెండు రోజులు బ్యాంకులు మూత

24 May, 2018 12:27 IST|Sakshi

సాక్షి, ముంబై:   దేశవ్యాప్తంగా బ్యాంకు సమ్మెకు దిగనున్నారు.  మే 30, 31 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నట్లు యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్   నోటీసులిచ్చిన సంగతి  తెలిసిందే.  ఈ మేరకు తాము ఈ సమ్మెలో పాల్గొననున్నామని  యూఎఫ్‌బీయూ ఏపీ, తెలంగాణ శాఖలు తెలిపాయి. మరోవైపు  తమ ఉద్యోగులు రెండు రోజులు పాటు సమ్మెకు దిగే అవకాశం ఉందని దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా  ప్రకటించింది.  దీంతో తమ వినియోగదారులు,   సేవలు  కొంతవరకు  ప్రభావితం కానున్నాయని తెలిపింది.

బ్యాంకు ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సమ్మె నిర్వహించనున్నారు. దీంతో దేశంలోని బ్యాంక్‌లు మూతపడనున్నాయని యూఎఫ్‌బీయూ  ప్రకటించింది. ఇప్పటివరకు 12సార్లు పలు దఫాలుగా జరిపిన చర్యలు విఫలం కావడంతో సమ్మెకు దిగనున‍్నట్టు  బ్యాంకు సంఘాలు వివరించాయి.  తమ పోరాటానికి  ఖాతాదారులు సహకరించాలని  విజ్ఞప్తి చేశాయి. ముఖ్యంగా  జీతం 2శాతం పెంపునకు, ఇతర సేవా పరిస్థితుల్లో మెరుగుదలను డిమాండ్‌ చేస్తున్నారు.  బ్యాంకు ఉద్యోగులకు 2017 నవంబర్‌ నుంచి వేతన సవరణ జరపాల్సి ఉందనీ,  ఇప్పటికైనా కేంద్రం స్పందించి ఉద్యోగులకు న్యాయం చేయాలని  యూఎఫ్‌బీయూ  కోరుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు