రెండు రోజుల బ్యాంకుల సమ్మె

13 Sep, 2019 09:51 IST|Sakshi

బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా నిరవధిక సమ్మెకు దిగనున్న సంఘాలు

సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత‍్వ బ్యాంకుల విలీనాన్ని మొదటినుంచీ వ్యతిరేకిస్తున్న బ్యాంకింగ్‌ యూనియన్లు మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నాయి. నాలుగు బ్యాంక్ ఆఫీసర్స్ ట్రేడ్ యూనియన్ సంస్థలు  కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఈ మేరకు ప్రతిపాదనలను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు ఇచ్చిన నోటీసులిచ్చాయి.

ముఖ్యంగా 10 ప్రభుత్వ  బ్యాంకుల విలీన నిర్ణయానికి వ్యతిరేకంగా సమ్మె సైరన్‌ మోగించనున్నాయి. ఈ మేరకు బ్యాంకింగ్‌ రంగంలో విలీనాలు, సమ్మేళనాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 25 అర్ధరాత్రి నుంచి  27 అర్ధరాత్రి వరకు నిరంతర సమ్మెకు పిలుపునిచ్చాయి. అలాగే నవంబర్ రెండవ వారం నుండి నిరవధిక సమ్మెకు వెళ్లాలని ప్రతిపాదించాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ) ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (ఐఎన్‌బీఓసీ), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ (ఎన్‌ఓబీఓ) సంయుక్తంగా ఈ సమ్మె నోటీసును అందించాయి.

>
మరిన్ని వార్తలు