రేపటి నుంచి బ్యాంకింగ్‌ సదస్సు!

22 Aug, 2018 00:39 IST|Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ సదస్సు గురువారం ఇక్కడ ప్రారంభమవుతుంది. రెండు రోజులు జరగనున్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, పీయూష్‌ గోయెల్, సురేశ్‌ ప్రభులు హాజరవుతారని అతున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. మొండిబకాయిలు, తాజా మూలధన కల్పన, బ్యాంకింగ్‌ విలీనాలు వంటి అంశాలపై ఈ సదస్సు చర్చించనున్నట్లు సమాచారం. నీతి ఆయోగ్, సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ పాలసీ రీసెర్చ్‌ నిర్వహిస్తున్న ఈ సదస్సులో కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారులుసహా ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల ఉన్నత స్థాయి అధికారులు దాదాపు అందరూ పాల్గొంటారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు